డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. తన నటనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం నటిగానే కాకుండా.. నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. నటిగానే కాకుండా.. సామాజిక అంశాలపై తన స్టైల్లో స్పందిస్తుంటుంది. ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి.. పెద్దల బాగోగుల గురించ సమయానుసారంగా కామెంట్స్ చేస్తుంటుంది. తాజాగా ఆమె డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్న మన ఊరు.. మన బడి ప్రోగ్రామ్ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా బాగా ఉందని ఆమె ప్రశంసించారు. దాదాపు ఏడేళ్లుగా సొసైటీలో మార్పు కోసం టీచ్ ఫర్ చేంజ్ అనే ట్రస్ట్ తరుపున ఆమె పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయా రంగాల్లో ప్రతిభావంతుల చేత కూడా పాఠాలు చెప్పిస్తున్నారు. స్కూల్లో డ్రాప్ అవుట్స్ ని తగ్గించి.. విద్యా ప్రమాణాలు పెరగాలన్న ఉద్దేశంతో మంచు లక్ష్మీ పనిచేస్తున్నారు. ఆ అనుభవంతోనే తెలంగాణ ప్రభుత్వాన్ని డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనలైజింగ్ గురించి విజ్ఞప్త చేశారు. పలు పాఠశాలల్లో టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ తరుపున బోధనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఐసీటీ గురించి ప్రస్తావన వచ్చిందని.. ఐసీటీ ట్రైనర్ల వలన విద్య ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్య పై చూపిస్తున్న శ్రద్ద వలన మూడేళ్లలో ఆ రంగం మరింత మెరుగుపడుతుందని.. విద్యార్థులలో మెరుగైన ఫలితాలను చూడటానికి తాను కూడా ప్రభుత్వంతో కలిసి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..