Lakshmi Manchu: అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..! మూతి పగిలిందంటూ..

|

Aug 26, 2024 | 3:49 PM

అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో విలన్ గా నటించింది. ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. అలాగే కొన్ని సినిమాలను నిర్మించింది కూడా.. నటిగా నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది మంచు లక్ష్మీ. ప్రస్తుతం మంచు లక్ష్మీ కూతురితో కలిసి అమెరికాలో ఉంటోంది.

Lakshmi Manchu: అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..! మూతి పగిలిందంటూ..
Manchu Lakshmi
Follow us on

మంచు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైన నటి మంచు లక్ష్మీ. అనగనగా ఓ ధీరుడు సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో విలన్ గా నటించింది. ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. అలాగే కొన్ని సినిమాలను నిర్మించింది కూడా.. నటిగా నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది మంచు లక్ష్మీ. ప్రస్తుతం మంచు లక్ష్మీ కూతురితో కలిసి అమెరికాలో ఉంటోంది. అక్కడ నుంచి ఆమె సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్స్‌ను షాక్ కు గురి చేస్తోంది. మొఖానికి ప్లాస్టర్స్ దర్శనమిచింది మంచు లక్ష్మీ.

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఓ ఫోటోను షేర్ చేసిన మంచు లక్ష్మీ మూతి పగిలిపోయిందంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. మంచు లక్ష్మీ మూతిపగిలిన ఫోటో చూసి అభిమానులు షాక్ అయ్యారు. దీని గురించి మంచు లక్ష్మీ ఇలా రాసుకొచ్చారు. నా ఫొటో చూశారుగా.. ఇదిగో.. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. అసలు ఏమైందంటే.. ముందు మనం మన శరీరం ఏది తీసుకోగలదో.. ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

నేను మోతాదుకి మించి రెండు మాములు ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అంతే. వెంటనే ఇలా అయ్యింది. కొన్ని నిమిషాల్లోనే  నా పెదవి అలెర్జీ వల్ల ఇలా తయారయ్యింది. నా పెదవులు పగిలిపోయాయి. లక్కీగా నాతో పాటు అప్పుడు నా ఫ్రెండ్ అయిన ఓ డాక్టర్ ఉన్నారు. దీంతో వెంటనే అలర్జీని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ ఇచ్చారు. లేకపోతే నా పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయేది. పెదవులు మీదే కాదు నా అరచేతి మీద కూడా ఓ వాపులా వచ్చింది. దీన్ని ఐసొలేటెడ్ డ్రగ్ ఎలర్జీ అంటారు. ఇప్పుడు అలర్జీ తగ్గడానికి స్టరాయిడ్స్ తీసుకున్నాను కాబట్టి అలర్జీ టెస్ట్ చేయలేకోతున్నాను. అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.