Anil Ravipudi: అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు కూడా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిపోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మెగా మూవీ ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది.

Anil Ravipudi: అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు కూడా..
Mana Shankara Vara Prasad Garu Director Anil Ravipudi

Updated on: Jan 28, 2026 | 10:00 PM

‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్‌ లో ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రీజినల్ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు ఈ జాబితాలో నిలిచింది. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ తన సినీ కెరీర్ లో తొమ్మిది సినిమాలను తెరకెక్కించగా అన్నీ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోషల్ ఉన్న ఈ డైనమిక్ డైరెక్టర్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన కాలేజీ చదివే రోజులను కూడా మరోసారి గుర్తు చేసుకున్నాడు అనిల్ రావిపూడి.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ రావిపూడి గుంటూరులోని విజ్ఞాన్ వడ్లమూడి కాలేజీలో చదువు పూర్తి చేశాడు. ఈ కాలేజీ నుంచే ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే అనిల్ రావిపూడితో పాటు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే కాలేజీలోనే చదువుకున్నాడట. అలాగే తెలంగాణకు చెందిన డైనమిక్ పొలిటికల్ లీడర్ కేటీఆర్ కూడా ఇదే కళాశాలలోనే చదువుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడినే బయట పెట్టారు. దీంతో ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. భీమ్స్ స్వరాలు సమకూర్చారు.

మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.