
కోలీవుడ్ డైరెక్టర్ ఎల్ విజయ్ పై దాడి జరిగింది. స్టార్ హీరోయిన్ అమల పాల్, డైరెక్టర్ ఏఎల్ విజయ్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. రోడ్డు పై కారు ఆపి మారి విజయ్ పై దాడి చేశాడు. రోడ్డు పై పెద్ద గొడవే జరిగింది. ఇటీవలే నటుడు విజయ్ కాంత్ మరణానికి సంతాపం తెలపడానికి దళపతి విజయ్ వెళ్ళినప్పుడు ఆయన పై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన మరవక ముందే ఇప్పుడు దర్శకుడు ఏఎల్ విజయ్ పై దాడి జరిగింది. దాంతో కోలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. విక్రమ్ హీరోగా నటించిన నాన్న సినిమాతో దర్శకుడు ఎల్ విజయ్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత హీరోయిన్ అమలాపాల్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకే విడిడిపోయారు. 2014లో పెళ్లి చేసుకొని 2017లో విడిపోయారు ఈ ఇద్దరు. ఇప్పుడు అమలాపాల్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అలాగే విజయ్ కూడా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే మిషన్ చాప్టర్-1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ పై దాడి జరిగింది.
ఈ సంఘటన జరిగి నాలుగు రోజులైంది.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయ్ కారు పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆ సమయంలో కారులో డైరెక్టర్ విజయ్‌తోపాటు మేనేజర్ మణివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఓ వ్యక్తి హెల్మెట్ తో కారు పై పలుసార్లు కొట్టాడు. ఆతర్వాత అతనితో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. దాంతో విజయ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. విజయ్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.