Lijomol Jose: జైభీమ్ సినిమా కోసం ఎలుకల కూర తిన్నాను.. షాకింగ్ విషయాలను చెప్పిన సినతల్లి..

ఇటీవల సూర్య నటించిన జైభీమ్ సినిమా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు

Lijomol Jose: జైభీమ్ సినిమా కోసం ఎలుకల కూర తిన్నాను.. షాకింగ్ విషయాలను చెప్పిన సినతల్లి..
Lijomol Jose

Updated on: Nov 22, 2021 | 9:31 AM

ఇటీవల సూర్య నటించిన జైభీమ్ సినిమా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆడియన్స్ అందరి చూపు సినతల్లి పైనే. ఈ సినిమాలోని సినతల్లి పాత్రలో జీవించింది లిజోమోల్ జోస్. మలయాళ, తమిళ్ చిత్రాల్లో నటించిన లిజోమోల్ జోస్ జైభీమ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో డబ్ అయిన సిద్ధార్థ్ ఒరేయ్ బామ్మర్ధి సినిమాతో టాలివుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లిజమోల్ ఓ గిరిజన మహిళగా.. గర్భవతిగా నటించింది అందరితో కన్నీళ్లు పెట్టించింది. సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఆ పాత్ర పోషించడానికి ఎంతో కష్టపడిందట.

సినతల్లి జీవనం.. వారి పద్దతులు తెలుసుకోవడానికి ప్రతిరోజూ గుడిసెలకు వెళ్ళేదాన్ని అని..అక్కడ వాళ్లు చేసే పని నేర్చుకుని వాళ్లతో కలిసి పని చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పులు వేసుకోరని.. పగలు రాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారని.. అవన్ని పనులు తాను కూడా చేసినట్లు తెలిపింది. సినిమాలో పాము కాటుకు మందులు ఇస్తుంటానని.. అది నిజంగానే నేర్చుకున్నానని తెలిపింది. అంతేకాకుండా.. ఆ గిరిజనులు ఎలుకలను వండుకుని తింటారని.. కానీ కేవలం పొలాల్లో ఉండే ఎలుకలను తింటారని.. నేను కూడా వాళ్లలా ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలనుకున్నానని.. అందుకే ఎలుక కూర తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది లిజోమోల్. ఎలుకల కూర అచ్చం చికెన్ లా అనిపించిందని.. ఇంట్లో వాళ్లకు తెలిసి తనను అడిగారని.. కానీ తను వాళ్లకు సర్ది చెప్పానని తెలిపింది. అప్పటి నుంచి ఆ విషయం ఇంట్లో వాళ్లు అడగలేదని చెప్పుకొచ్చింది లిజోమోల్.

Also Read: Jai Bhim: జైభీమ్ సినిమా వివాదంపై స్పందించిన డైరెక్టర్.. కావాలని సూర్యను టార్గెట్ చేస్తున్నారంటూ..

Gamanam: ప్రేక్షకుల ముందుకు గమనం.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్..

Most Eligible Bachelor: ఆహాలో రికార్డులు బద్దలుకొడుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌.. ఎంతమంది వీక్షించారంటే..?

Bhagat Singh Nagar Movie Pre Release Event: ‘భగత్‌సింగ్‌ నగర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌