హీరోయిన్ భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మలయాళం హీరో దిలీప్ కుమార్ తన తోటి నటి భావనను అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా 2017లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పల్సర్ సునీని పోలీసులు అరెస్ట్ చేయగా.. అతను ఇచ్చిన సమాచారంతో హీరో దిలీప్ కుమార్‌ను ప్రధాన నిందుతుడిగా చేర్చారు. ఈ ఘటనలో అతని భార్య నటి కావ్య మాధవన్ పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమెను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు గతంలోనే కోర్టును కోరారు. దీంతో ట్రయల్ కోర్టు నటి కావ్యను విచారించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే గతంలో కావ్యను పలుమార్లు పోలీసులు విచారించారు. తాజాగా సోమవారం ఈ కేసు విచారణలో భాగంగా.. కావ్య మాధవన్‌ను మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఆగస్ట్ 10న మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు విచారణంలో భాగంగా కావ్య హాజరయ్యారు.
2017 ఫిబ్రవరి 17న కొచ్చిలో సినీ నటి భావనను కిడ్నాప్ చేసి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ హోటల్లో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) స్టేజ్ షో రిహార్సల్ జరుగుతున్న సమయంలో నటి భావనపై హీరో దిలీప్ దాడికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో కావ్య మాధవన్ కూడా అక్కడే ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో హీరోయిన్ భావన కిడ్నాప్ కేసులో దిలీప్ ప్రధాన నిందితుడుగా వున్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుడు పల్సర్ సునీతోపాటు 178 మందిని 300 మందికి పైగా సాక్షులతో విచారించారు. ఈ కేసు విచారణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని గతంలోనే హైకోర్టు, సుప్రీం కోర్టులు గడువులు విధించాయి.. కానీ కోవిడ్ నేపథ్యంలో కోర్టు తేదీలను సవరించింది.
Nayanatara: రింగ్ చూపిస్తూ అసలు విషయం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. రూమర్స్‌కు చెక్ పెట్టినట్టేనా ?