Tollywood: తెలుగులో ఒక్క పాటతో సెన్సేషన్.. సింపుల్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. ఫొటోస్ వైరల్

స్టార్ సింగర్ గా ఫుల్ క్రేజ్. మలయాళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. తన మధురుమైన గొంతుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి స్టార్ సింగర్ ఎలాంటి హంగామా, హడావిడి, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకుంది.

Tollywood: తెలుగులో ఒక్క పాటతో సెన్సేషన్.. సింపుల్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. ఫొటోస్ వైరల్
Arya Dhayal Marriage

Updated on: Oct 03, 2025 | 10:22 PM

మలయాళం స్టార్ సింగర్ ఆర్య దయాల్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మ్యూజిక్ లవర్స్ కు ఈమె పేరు బాగా పరిచయం. మలయాళంలో స్టేజ్ షోలతో, తన మ్యూజిక్ బ్యాండ్ తో బాగా ఫేమస్ అయిన ఆర్య దయాల్ కు కేరళలో చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ ఆమె బ్యాండ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెవి పలు సింగింగ్ వీడియోలు గతంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు సినిమాల్లో సింగర్ గానూ సత్తా చాటుతోంది ఆర్య దయాళ్. మలయాళ సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే సింగర్ గా ఎదుగుతోన్న ఆమె తెలుగులో కూడా ఓ పాట పాడింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమాలో దేవరాజ సాంగ్ పాడింది ఈ బ్యూటిఫుల్ సింగరే. క్లాసిక్, పాప్ మిక్స్ చేసి పాడిన ఈ సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ వచ్చాయి. మెలోడీ పాటలు కూడా ఎంతో అద్బుతంగా పాడుతుందీ స్టార్ సింగర్.

 

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఆర్య దయాల్ ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఒక శుభవార్తను షేర్ చేసింది. అభిషేక్ ని సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఆమె తన పెళ్లి సర్టిఫికెట్ చూపిస్తూ తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు, అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భర్తతో సింగర్ ఆర్య దయాళ్..

 

కాగా ఆర్య దయాల్ భర్త అభిషేక్ ది కూడా సంగీత పరిశ్రమే అని తెలుస్తుంది. మరోవైపు స్టార్ సింగర్ గా మంచి ఫేమ్ ఉండి కూడా ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆర్య దయాళ్ దంపతులను అభినందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.