Allu Arjun: అప్పుడు నాని ప్రియురాలిగా నటించింది.. ఇప్పుడు అల్లు అర్జున్ సిస్టర్‎గా ఆ స్టార్ హీరోయిన్.. ?

పుష్ప 1, 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. దీంతో ఇప్పుడు బన్నీ నటించనున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా బన్నీ నెక్ట్స్ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరలవుతుంది.

Allu Arjun: అప్పుడు నాని ప్రియురాలిగా నటించింది.. ఇప్పుడు అల్లు అర్జున్ సిస్టర్‎గా ఆ స్టార్ హీరోయిన్.. ?
Allu Arjun

Updated on: May 25, 2025 | 1:59 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై భారీ హైప్ నెలకొంది. అటు పుష్ప 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. మరోవైపు జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు అట్లీ. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అదెంటంటే.. ఈ చిత్రంలో బన్నీకి సిస్టర్ రోల్ ఉంటుందని.. ఈ పాత్ర ఈ సినిమా కథను మలుపు తిప్పుతుందని ప్రచారం.

అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సిస్టర్ పాత్రలో మలయాళీ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించనున్నట్లు టాక్. ఈ పాత్ర చాలా ఎమోషనల్ గా సాగుతుందని టాక్. ఇన్నాళ్లు మలయాళం, తెలుగులో హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటించిన నజ్రీయ ఇప్పుడు బన్నీకి సిస్టర్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. గతంలో అట్లీ దర్శకత్వం వహించిన రాజా రాణి చిత్రంలో కథానాయికగా నటించిన నజ్రీయా ఇప్పుడు సిస్టర్ రోల్ చేసేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన అంటే సుందరానికి సినిమాలో కథానాయికగా నటించింది.

బన్నీ కోసం అట్లీ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథ సాగుతుందని.. ఇందులో బన్నీ పాత్ర పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ గా ఉంటుందని టాక్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..