మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ ప్రధానపాత్రలో..డైరెక్టర్ షాజీ కైలాస్ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం కడువా. హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డామాను మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యం లో హీరో పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడారు.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ” నా గత చిత్రం జనగణమన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల విడుదల అయ్యింది. నా వరకూ ఎక్కడో చోట పాన్ ఇండియా థియేటర్ రిలీజ్ ని మొదలుపెట్టాలి. అది ‘కడువా’ తో చేస్తున్నా. భవిష్యత్ లో రిమేక్ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. భవిష్యత్ లో ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్ సినిమాలని రూపొందించడానికి నిర్మాతలు మొగ్గుచూపుతారు. ముఖ్యంగా పెద్ద సినిమాలు కేవలం ఓటీటీ మీద ఆధారపడి బిజినెస్ చేసే పరిస్థితి వుండదు. రాజమౌళి గారు బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఒక మోడల్ ని చూపించారు. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఆ చిత్రాలు మెయిన్ స్ట్రీమ్ గా రిలీజ్ అయ్యాయి. ఈ మోడల్ ని ఫాలో అవ్వాలి. కేజీఎఫ్ చిత్రం కూడా ఇదే మోడల్ లో విడుదల అయ్యింది. ముఖ్యంగా పెద్ద స్కేల్ సినిమాలు భవిష్యత్ లో అన్ని భాషల్లో థియేటర్ రిలీజ్ కావాలి. నేను ‘కడువా’తో ఆ ప్రయత్నం మొదలుపెట్టాను.
తెలుగులో సినిమాలు రీమేక్ అవుతున్నాయి…లూసిఫర్ చిరంజీవి గారు చేస్తున్నారు. నేను తెలుగు లో డైరెక్ట్ చేసివుంటే ఆయనే నా ఫస్ట్ ఆప్షన్. మలయాళం కంటే పెద్ద స్కేల్ లో సినిమా ఉండబోతుందని నమ్ముతున్నా. కథలో మార్పులు గురించి నాకు తెలీదు. నేనూ ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూస్తున్నాను.. అందరిలానే నేనూ చిరంజీవి గారికి అభిమానిని. లూసిఫర్ రీమేక్ చేయమని అడిగారు. కానీ అప్పటికి వేరే సినిమాతో బిజీగా వుండటం వలన కుదరలేదు. అంతకుముందు సైరా నరసింహ రెడ్డిలో కూడా ఒక పాత్ర చేయమని కోరారు. అప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా వుండటం వలన వీలుపడలేదు. చిరంజీవి గారితో పని చేయాలని వుంది. లూసిఫర్ 2 చేస్తున్నా. ఒకవేళ దీనికి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..