
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ రాజాసాబ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇదివరకే పూర్తైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో కొరియన్, అమెరికన్ యాక్టర్స్ సైతం కనిపించనున్నారని సమాచారం. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఇతర భాషలకు చెందిన నటీనటులు సైతం నటించనున్నారని టాక్. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అతడు మరెవరో కాదు.. మలయాళీ సీనియర్ హీరో మమ్ముట్టి.
లేటేస్ట్ సమాచారం ప్రకారం స్పిరిట్ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం మమ్ముట్టిని ఎంపిక చేసినట్లు టాక్. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాకు హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా మెయిన్ స్టోరీ కొత్తగా ఉంటుందని టాక్.
ఇవి కూడా చదవండి :