Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మరో ట్రీట్.. ఆ సూపర్ హిట్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..

ఇప్పటికే ఆరెంజ్, సింహాద్రి, జల్సా, ఖుషి, ఒక్కడు సినిమాలు రీరిలీజ్ చేయగా.. భారీ వసూళ్లు రాబట్టాయి. ఇటీవలే దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీరిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది సూపర్ హిట్ ఫిల్మ్ రీరిలీజ్ చేస్తున్నారు.

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మరో ట్రీట్.. ఆ సూపర్ హిట్ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..
Mahesh Babu

Updated on: Jun 03, 2023 | 4:11 PM

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రీలిలీజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా స్టార్ హీరోస్ పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాలను మరోసారి థియేటర్లలో విడుదల చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో దశాబ్ది వేడుకలకు.. పలు ప్రత్యేక రోజులకు సైతం స్టార్స్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆరెంజ్, సింహాద్రి, జల్సా, ఖుషి, ఒక్కడు సినిమాలు రీరిలీజ్ చేయగా.. భారీ వసూళ్లు రాబట్టాయి. ఇటీవలే దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీరిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది సూపర్ హిట్ ఫిల్మ్ రీరిలీజ్ చేస్తున్నారు.

మహేష్ బాబు ప్రధాన పాత్రలో.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టనైనర్ బిజినెస్ మ్యాన్. ఇండస్ట్రీలో మహేష్ బాబు క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజ్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ సరసన కాజల్ కథానాయికగా నటించగా.. థమన్ సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటురు కారం సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి చేర్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.