Mahesh Babu: కన్నీరు మున్నీరవుతున్న మహేష్.. అన్న స్టే స్ట్రాంగ్ అంటున్న ఫ్యాన్స్

నిన్న కృష్ణ ఆరోగ్యొం దెబ్బతినడంతో ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు.

Mahesh Babu: కన్నీరు మున్నీరవుతున్న మహేష్.. అన్న స్టే స్ట్రాంగ్ అంటున్న ఫ్యాన్స్
Mahesh Babu

Updated on: Nov 15, 2022 | 12:12 PM

సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. ‘కార్డియాక్ అరెస్ట్ తో హాస్పటల్ లో చేరిన కృష్ణ నేడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు. నిన్న కృష్ణ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. నిన్నటినుంచి ఆయన ఆరోగ్యం ఆందళనకరంగా ఉంటడంతో అభిమానులు అంతా ఆందోళన చెందారు. కాగా ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు కన్నుమూశారు. కృష్ణ మృతితో అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తెలుగు సినిమా చరిత్ర పై చెరగని సంతకం కృష్ణ. ఇక కృష్ణ వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే.

స్టార్‌ కిడ్స్‌ సినిమాల్లోకి రావడం ఈజీనే. నిలదొక్కుకోవడం అంతా ఆషామాసీ కాదు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్‌బాబు సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. నేడు టాప్‌ మోస్ట్‌ హీరోల్లో మహేష్‌ ఉన్నారంటే నాడు కృష్ణ దిద్దిన ఓనమాలే. మహేష్ బాబు నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ఆయన ప్రియమైన తండ్రి కృష్ణ.. మరణ వార్త ఆయన్ను ఏ స్థాయిలో దహించివేస్తుందో అర్థం చేసుకోవచ్చు..

ఇక  మహేష్ బాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఈఏడాది మహేష్ అన్న రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ సమయంలో మహేష్ కరోనా పాజిటివ్ తో బాధపడుతుండటంతో ఆయన చివరి చూపుకు నోచుకోలేకపోయారు. ఆతర్వాత 49 రోజుల క్రితం మహేష్ తల్లి ఇందిరా దేవి కూడా కన్నుమూశారు. తల్లి మృతితో మహేష్ కృంగిపోయారు. ఇక ఇప్పుడు కృష్ణ మరణంతో మహేష్ మరింత బాధలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా కృష్ణ, మహేష్ అభిమానులు ఆయనను తలుచుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ కు దైర్యం చెప్తూ స్టే స్ట్రాంగ్ అన్న అంటూ పోస్ట్ లు పెడుతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి