Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. త్రివిక్రమ్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్

|

Nov 27, 2022 | 8:50 AM

దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అప్పట్లో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. త్రివిక్రమ్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్
Mahesh Babu
Follow us on

సూపర్ సార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీకోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అప్పట్లో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. దాంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ పడింది. ప్రస్తుతం మహేష్ కొండంత బాధలో ఉన్నాడు. వరుసగా అన్న, అమ్మ, నాన్న ఇలా అందరు దూరం కావడంతో మహేష్ ఎంతో మనోవేదనకు గురవుతున్నాడు.

ఈ బాధనుంచి కోలుకోగానే మహేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు  నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నాడు. ఓ సీనియర్ హీరోయిన్ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతుందట.

అలాగే ఓ హీరోయిన్‌తో సాలిడ్ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. మహేష్ సినిమాకు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలనీ చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి