
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ అమ్మాయిల కలల యువరాజు. 47 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువకుడిగా కనిపించడం కేవలం మహేష్ బాబుకే సాధ్యమని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం సరికొత్త లుక్‍లో మరింత యంగ్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్ అయోమయంలో పడేస్తున్నారు మహేష్. అయితే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయం చేయడమే తన బాడీ ఫిట్ నెస్ సిక్రెట్ అంటుంటారు మహేష్. గతంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా తన డైట్ సిక్రెట్ గురించి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నారు మహేష్. అయితే యంగ్ కుర్రాడిగా ఫిట్ నెస్ మెయింటెన్ చేయడానికి మహేష్ ఎక్కువగానే కష్టపడతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. దీనిని స్వయంగా మహేష్ బాబు షేర్ చేయడం విశేషం.
“శనివారం మెరుపులు.. ఒక నిమిషం ల్యాండ్ మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటెల్ బెల్ స్వింగ్స్, ఒక నిమిషం స్కిల్ మిల్ రన్.. మీరెన్ని సెట్స్ చేయగలరు” అంటూ అభిమానులను ప్రశ్నిస్తూ.. తాను వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు మహేష్. అందులో మహేష్.. ఎంతో కష్టమైన వర్కవుట్స్ సులభంగా చేసేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసి విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. మీనాక్షి హీరోయిన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ తర్వాత జక్కన్న దర్శకత్వంలో నటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.