Sitara Ghattamaneni: ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని ఉందంటోన్న మహేష్ బాబు తనయ.. సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో చూశారా ?..

|

Jul 19, 2023 | 6:29 PM

మహేష్ బాబు, నమ్రత దంపతుల కూతురు సీతూపాప మల్టీటాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్, ఫ్యామిలీ విశేషాలను పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓ ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‏గా వ్యవహరించింది. సదరు జ్యూవెల్లరీ సంస్థ కోసం ఇచ్చిన యాడ్ ఫోటోస్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

Sitara Ghattamaneni: ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని ఉందంటోన్న మహేష్ బాబు తనయ.. సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో చూశారా ?..
Sitara
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి పాన్ ఇండియా లెవల్ మూవీ రాబోతుంది. మరోవైపు మహేష్ వారసుల తెరంగేట్రం సైతం జరగబోతుంది. వన్ నేనొక్కడినే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‏గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్ తనయుడు గౌతమ్. ఇక సినిమాల్లోకి రాకముందే తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది సూపర్ స్టార్ గారాలపట్టి సితార. మహేష్ బాబు, నమ్రత దంపతుల కూతురు సీతూపాప మల్టీటాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్, ఫ్యామిలీ విశేషాలను పంచుకుంటుంది. ఇక ఇటీవలే ఓ ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‏గా వ్యవహరించింది. సదరు జ్యూవెల్లరీ సంస్థ కోసం ఇచ్చిన యాడ్ ఫోటోస్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ పై సితార ఫోటోస్ ప్రదర్శించడంతో మహేష్ బాబు సంతోషానికి అవధులు లేవు. తన కూతురు ఫస్ట్ యాడ్ ఫోటోస్ షేర్ చేస్తూ గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ఇక తాజాగా ఆ యాడ్ వీడియోను రిలీజ్ చేశారు మహేష్. తన కూతురు బ్యూటీఫుల్ టాలెంట్ చూసి గర్వంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ఇక తాజాగా విడుదలైన వీడియోలో సితార నటనతో అదరగొట్టిందనే చెప్పాలి. ఇప్పటికే నటనలో చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది.. మొత్తానికి నటనలో తండ్రిని మించిపోయేలా కనిపిస్తోంది సితార. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. సితార యాక్టింగ్ చూసి సంతోషపడిపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవల సదరు జ్యూవెల్లరీ సంస్థ నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్న సీతార తనకు సినిమాల్లోకి రావాలని ఉందని తెలిపింది. నటనపై తనకు ఆసక్తి ఉందని.. అలాగే తనకు యాడ్ చేసినందుకు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఛారిటీకి అందించానని చెప్పుకొచ్చింది. దీంతో సితార గొప్ప మనసుపై ప్రశంసలు కురిపించారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.