Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్.. ఎవరంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata).. సూపర్ హిట్ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్.. ఎవరంటే
Mahesh Babu

Edited By: Ravi Kiran

Updated on: May 04, 2022 | 6:26 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata).. సూపర్ హిట్ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ తనలోని సరికొత్తకోణాన్ని చూపించనున్న సర్కారు వారి పాట నుంచి ఇప్పటికే అదిరిపోయే పాటలు, గూస్ బంప్స్ తెప్పించే టీజర్.. ఎక్స్పెక్టేషన్స్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిన ట్రైలర్ ప్రేక్షకుల ముందు వచ్చేశాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని సమ్మర్ స్పెషల్ గా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.

ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మే 7న హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఓ స్టార్ హీరో అతిథి గా రానున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మహేష్ సినిమా ప్రీరిలీజ్ కు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. పవర్ స్టార్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారట. మహేష్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే.. దాంతో మహేష్ ఈవెంట్ కు త్రివిక్రమ్ కన్ఫామ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మహేష్ స్వయంగా పవర్ స్టార్ ను ఇన్వైట్ చేశారని.. దానికి తోడు త్రివిక్రమ్ కూడా పవన్ ను రావాలని కోరడంతో సర్కారు వారి పాటు ప్రీరిలీజ్ ఈవెంట్ కు  పవర్ స్టార్ గెస్ట్ గా ఫిక్స్ అయ్యారట. గతంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. సో ఈ సారి మహేష్ కోసం పవర్ స్టార్ ప్రీరిలీజ్ గెస్ట్ గా రానున్నారని టాక్ వైరల్ అవుతుండటంతో ఇద్దరి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Trisha Birthday: 2 దశాబ్ధాలుగా వెండితెరను ఏలుతున్న రాజసం ఆమెది.. చెన్నై చంద్రం త్రిష బర్త్ డే స్పెషల్

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..