Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ ‘సర్కారు వారి పాట’.. రన్ టైం ఎంత అంటే..

|

May 08, 2022 | 3:21 PM

సర్కారు వారి పాట' పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది. మహేష్ డైలాగులు మాసీ రియాక్షన్ ను రాబడుతున్నాయి. తమన్ సాంగ్స్ ఎక్కడ విన్నా రీసౌండ్ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ సర్కారు వారి పాట.. రన్ టైం ఎంత అంటే..
Mahesh Babu
Follow us on

సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది. మహేష్ డైలాగులు మాసీ రియాక్షన్ ను రాబడుతున్నాయి. తమన్ సాంగ్స్ ఎక్కడ విన్నా రీసౌండ్ చేస్తున్నారు. సినిమా పై విపరీతమైన ఎక్స్‌ పెక్టేషన్స్ ను పెంచేస్తున్నాయి. `భరత్ అనే నేను`..`మహర్షి`.. `సరిలేరు నీకెవ్వరు`తో బ్లాక్ బస్టర్ అందుకుని దూసుకుపోతున్నారు మహేష్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. `గీత గోవిందం` తర్వాత పరశురాం దర్శకత్వం వహించిన సినిమా కూడా ఇదే అవ్వడంతో రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెట్ గా వచ్చిన మాస్ సాంగ్ మహేష్ అభిమానులను విపరీతంగగా ఆకట్టుకుంది. మహేష్ మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది సర్కారు వారి పాట. ఈ సినిమాకోసం మహేష్ అభిమానులతోపాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రన్ టైం ను లాక్ చేసింది సెన్సార్ బోర్డు. `యు-ఏ` సర్టిఫికెట్ బోర్డ్ జారీ చేసింది. సినిమా రన్ టైమ్ 162 నిమిషాల 25 సెకెన్లు. సినిమాకి సంబంధించి పెద్దగా కట్స్ లేనట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నవీన్ ఎర్నేని.. వై.రవిశంకర్.. రామ్ ఆచంట.. గోపి ఆచంట ఈ సినిమాను నిర్మించారు. మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..

T.Krishna: టీ. కృష్ణలు వేర్వేరు అని తెలియక కలగాపులగం చేసి పారేశారు

Prabhas: ప్రభాస్‌ కోసం మరో బాలీవుడ్‌ బ్యూటీని దింపుతోన్న చిత్ర యూనిట్‌.. అధికారిక ప్రకటన..