Sarkaru Vaari Paata 7 Days Collections: సర్కారు వారి పాట 7 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న మహేష్..

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద సత్తా చాటుతోంది.

Sarkaru Vaari Paata 7 Days Collections: సర్కారు వారి పాట 7 రోజుల కలెక్షన్స్.. బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న మహేష్..
Sarkaru Vaari Paata

Updated on: May 19, 2022 | 4:24 PM

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తోంది. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజులలో ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద సత్తా చాటుతోంది. మహేష్.. కీర్తి సురేష్ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విడుదలైన తొలి వారంలో సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా 107.26 కోట్లు వసూళ్లు చేయగా.. ఇక గ్రాస్ పరంగా చూస్తే రూ. 175 కోట్లు వచ్చాయి. మొత్తంగా విడుదలైన అతి తక్కువ సమయంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మహేష్ మూవీగా నిలిచింది.

సర్కారు వారి పాట 7 రోజుల కలెక్షన్స్…
నిజాం.. రూ.33.88 కోట్లు.
సీడెడ్.. రూ. 11.47 కోట్లు..
యూఏ. రూ. 11.06 కోట్లు.
గుంటూరు..రూ. 8.12 కోట్లు
ఈస్ట్ .. రూ.7.73 కోట్లు..
కృష్ణ.. రూ6.16 కోట్లు.
వెస్ట్.. రూ.5.18 కోట్లు.
నెల్లూరు..రూ.3.40 కోట్లు.
తెలుగు రాష్ట్రాల్లో రూ. 87 కోట్లు.
కేఏ ప్లాస్ రాయ్ లో రూ. 7.83 కోట్లు.
ఇక ఓవర్సీస్‏లో రూ. 12.43 కోట్లు కలెక్షన్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్ .. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. జూన్ నెలలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాబోతుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us