AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hi Nanna: ప్రతి కూతురు కోసం నాన్న పాట.. హత్తుకుంటున్న ‘గాజు బొమ్మ’ సాంగ్..

హాయ్ నాన్న సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు శౌర్యువ్. జెర్సీ సినిమా తర్వాత ఈ మూవీతో మరోసారి నాన్న పాత్రలో మెప్పించనున్నాడు నాని. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‏తో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి ఏర్పడింది. గతంలో విడుదలైన సమయమా సాంగ్ ఆకట్టుకుంది. మృణాల్, నాని మధ్య వచ్చే ఈ లవ్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు.

Hi Nanna: ప్రతి కూతురు కోసం నాన్న పాట.. హత్తుకుంటున్న 'గాజు బొమ్మ' సాంగ్..
Hi Nanna
Rajitha Chanti
|

Updated on: Oct 06, 2023 | 3:03 PM

Share

దసరా సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రియులను అలరించాడు. ఇక ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హాయ్ నాన్న సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు శౌర్యువ్. జెర్సీ సినిమా తర్వాత ఈ మూవీతో మరోసారి నాన్న పాత్రలో మెప్పించనున్నాడు నాని. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‏తో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి ఏర్పడింది. గతంలో విడుదలైన సమయమా సాంగ్ ఆకట్టుకుంది. మృణాల్, నాని మధ్య వచ్చే ఈ లవ్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు.

“ప్రతి కూతురు కోసం నాన్న పాట.. గాజు బొమ్మ” అంటూ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశాడు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఆలపించారు. ఫీల్ గుడ్ మ్యూజిక్‏తో ఆకట్టుకుంటున్న ఈ పాట.. ఫాదర్ అండ్ డాటర్స్ కు నచ్చేస్తుంది. ఇందులో నాని కూతురిగా బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. ఇక ఇందులో శ్రుతిహాసన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదంతా బాగానే ఉన్నా.. కొద్ది రోజులుగా హాయ్ నాన్న సినిమా రిలీజ్ డేట్ విషయంలో అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ మారుతుందని.. అందుకు కారణం అదే సమయంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతుందట. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయనున్నారంటూ టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్