Varanasi Movie: జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా.. మహేష్ సినిమా కోసం ఏకంగా ‘అవతార్‌’ నే..

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వారణాసి మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేశారు రాజమౌళి.

Varanasi Movie: జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా.. మహేష్ సినిమా కోసం ఏకంగా అవతార్‌ నే..
Varanasi Movie

Updated on: Dec 04, 2025 | 8:16 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ పుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఇటీవల ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ చేయడానికి గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఓ బిగ్ ఈవెంట్ నిర్వహించాడు. కాగా వారణాసి సినిమాతో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఓ సూపర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ సిరీస్‌లో మూడవ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ 19న ఇండియాతో పాటు వివిధ దేశాల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకు ‘వారణాసి’ టీజర్‌ను ఈ చిత్రానికి జత చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ‘వారణాసి’ని ప్రమోట్ చేయడానికి రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాతో పాటు చాలా దేశాల్లో ‘అవతార్ 3’ థియేటర్లలో వారణాసి సినిమా టీజర్ ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.

‘అవతార్’ సినిమా సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కారణంగా, రాజమౌళి ‘వారణాసి’ సినిమాను ప్రమోట్ చేయడానికి ఈ సూపర్ హిట్ మూవీని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలలో ‘అవతార్ 3’ సినిమా ఇంటర్వెల్ సమయంలో మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా టీజర్ ను ప్రదర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి

 

అవతార్ 3′ లేదా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రానికి జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఇది ‘అవతార్’ సిరీస్‌లో మూడవ చిత్రం. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ చిత్రాన్ని చూసిన జేమ్స్ కామెరూన్, రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ‘RRR’ గురించి రూపొందిన డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరూన్ కూడా కనిపించి ఆ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. ఈ క్రమంలోనే జేమ్స్ కామెరూన్ తన అవతార్ సినిమా ద్వారా రాజమౌళి చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

వారణాసి టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.