Mahesh New Look: ఇదేంటి బాబు ఏజ్‌ పెరుగుతుందా.. తగ్గుతుందా.? నాలుగు పదుల వయసులోనూ నవ యువకుడిలా..

Mahesh New Look: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌ సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్‌ డైలాగ్‌లు.. అద్భుతమైన ఫైటింగ్‌లతో...

Mahesh New Look: ఇదేంటి బాబు ఏజ్‌ పెరుగుతుందా.. తగ్గుతుందా.? నాలుగు పదుల వయసులోనూ నవ యువకుడిలా..
Mahesh New Look

Updated on: Aug 09, 2021 | 2:19 PM

Mahesh New Look: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌ సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్‌ డైలాగ్‌లు.. అద్భుతమైన ఫైటింగ్‌లతో అబ్బాయిల అభిమాన హీరోగా మహేష్‌ టాలీవుడ్‌ను ఏలుతున్నారు. మహేష్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు ఎక్కడలేని అంచనాలు పెరిగిపోతాయి. కేవలం అభిమానులే కాకుండా ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమావైపు చూస్తుంది. బాల నటుడిగా కెరీర్‌ మొదలు పెట్టిన మహేష్‌ ఇప్పుడు సూపర్‌ స్టార్‌ రేంజ్‌కి ఎదిగాడు.

ఇక ఎంతో మంది అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన మహేష్‌ బాబు పుట్టిన రోజు నేడు (ఆగస్టు 09). ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలంతా పెద్ద ఎత్తున విషెస్‌ చెబుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మహేష్‌ అభిమానుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నేటితో 46వ పడిలోకి అడుగుపెట్టారు. అయితే మహేష్‌ వయసు అంత అంటే ఎవ్వరూ నమ్మరు. నాలుగు పదుల వయసులోనూ నవ యువకుడిలా కనిపిస్తూ అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంటారు మహేష్‌. ఈ క్రమంలోనే తాజాగా మహేష్‌ బాబు.. తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పాతికేళ్ల కుర్రాలు కూడా మహేష్‌ ముందు పెద్దవారిలో కనిపిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ ఫొటో చూసిన ఆయన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న మహేష్‌ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Prabhas – Nag Ashwin Movie: త్వరలోనే ప్రాజెక్ట్ కే సెకండ్ షెడ్యూల్.. కీలక సన్నివేశాలన్నీ ఇందులోనేనట..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఖాతాలో కొత్త శత్రువు.. ఈయన చాలా స్పెషల్ గురూ!

ఈ సూపర్ స్టైలిష్ చైల్డ్ ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్లను చూపుల్తోనే కట్టిపడేస్తుంది