Mahesh Babu: మహేష్ మూవీ కోసం ‘సీతారామం’ బ్యూటీ ఫిక్స్ చేశారా..?

|

Aug 26, 2022 | 8:16 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Mahesh Babu: మహేష్ మూవీ కోసం సీతారామం బ్యూటీ ఫిక్స్ చేశారా..?
Mrunal Thakur, Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత ఈ కాంబోలో సినిమా రానుంది. ఈ కాంబోలో సినిమా రాబోతుందని తెలిసి ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. మహేష్ ఇటీవలే సర్కారు వారి పాట అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి మహేష్ కొసం త్రివిక్రమ్ అదిరిపోయే కథని సిద్ధం చేశారట. మొన్నామధ్య మహేష్ మాట్లాడుతూ నేను కానీ త్రివిక్రమ్ కానీ ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చేయడానికి చాలా ఆసక్తితో ఉన్నా అంటూ సినిమా గురించి హింట్ ఇచ్చారు. దాంతో మహేష్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు మహేష్.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ ఇప్పుడు ఫిలిం నగర్లో జరుగుతోంది. మహేష్ రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా ఓ క్రేజీ బ్యూటీ పేరు వినిపిస్తోంది. ఇటీవలే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంది హిట్ తో పాటు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ను మహేష్ సినిమా కోసం అనుకుంటున్నారట. ఇటీవలే సీతారామం సినిమాతో ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ నటనకు ఫిదా అయిన జక్కన్న మహేష్ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారట. మహేష్ పక్కన ఈ భామ అయితే సరిగ్గా సూటవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత  అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి