Mahesh Babu : గురూజీ సినిమాకోసం మహేష్ అన్ని రోజులు కేటాయిస్తున్నారట.!!

సూపర్ సస్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు మహేష్. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి భారీ విజయాన్ని

Mahesh Babu : గురూజీ సినిమాకోసం మహేష్ అన్ని రోజులు కేటాయిస్తున్నారట.!!
Mahesh Babu

Updated on: Jul 12, 2022 | 7:20 AM

సూపర్ సస్టార్ మహేష్ బాబు(Mahesh Babu)వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు మహేష్. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి భారీ విజయాన్ని అందుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా పోకిరి నాటి మహేష్ ను గుర్తు చేసింది. ఈ మూవీలో కీర్తిసురేష్ మహేష్ కు జోడిగా అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళు తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా వస్తోంది. దాంతో మహేష్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి హ్యాట్రిక్ హిట్టు కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకోసం భారీ పారితోషకాన్ని అందుకోనున్నారట. మహేష్ సర్కారు వారి పాట సినిమాకు 55 కోట్లు పారితోషికం తీసుకున్నారని ఆ మధ్య వార్తలు తెగ హల్ చల్ చేశాయి. తాజాగా గురూజీ సినిమా కోసం మహేష్ దాన్ని  75 కోట్లకు పెంచేశారని చెబుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ ఏకంగా 100 రోజులు కేటాయించనున్నారట. అందుకే పారితోషకం ఎక్కువ తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అందాల భామ శ్రీలీల ఈ మూవీలో మహేష్ మరదలిగా కనిపించనుందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి