Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఊహించని చిక్కుల్లో పడ్డారు. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ బాబు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 28న ఉదయం 10. 30 నిమిషాలకు హైదరాబాద్ లోని ఈడి హెడ్ క్వార్టర్స్ కి రావాలని నోటీసులు జారీ చేశారు అధికారులు.

హీరో మహేష్‌బాబుకు ED నోటీసులు జారీచేసింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ వ్యవహారంలో.. 28న విచారణకు రావాలంటూ మహేష్‌కు నోటీసులు పంపారు. ప్రమోషన్ కింద రూ. 3.4 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ. ఈనెల 16న ED హైదరాబాద్ సోదాలు చేసింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ ఆఫీసులతోపాటు, ఈ సంస్థల అధినేతల ఇళ్లపై ED దాడులు చేసింది .ఆ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా మహేష్ ఈనెల 28న ఉదయం 10. 30 నిమిషాలకు హైదరాబాద్ లోని ఈడి హెడ్ క్వార్టర్స్ కి రావాలని నోటీసులు జారీ చేశారు అధికారులు.
ఈ యాడ్ కోసం మహేష్ బాబు మొత్తం 5 కోట్ల 90 లక్షలు తీసుకున్నట్టు గుర్తించారు. రూ. 3.4 కోట్లు చెక్, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో మహేష్ తీసుకున్నట్టు గుర్తించారు. సాయి సూర్య డెవలపర్ ఎండీ సతీష్ చంద్ర ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ విషయం. మహేష్ బాబు భార్య పిల్లలతో కలిసి సాయిసూర్య డెవలపర్స్ యాడ్ లో నటించాడు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తుంది.
రాజమౌళి సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఈ వార్త షాక్ ఇచ్చింది. ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడీ నోటీసుల పై మహేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




