Superstar Krishna: కొండంత శోకం.. తండ్రి పార్ధివదేహాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చిన మహేష్ బాబు

|

Nov 15, 2022 | 1:00 PM

కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్‌. కృష్ణ భౌతికాయాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు.

Superstar Krishna: కొండంత శోకం.. తండ్రి పార్ధివదేహాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చిన మహేష్ బాబు
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూతతో టాలీవుడ్ ఇండస్ట్రీ నిశీధిని నింపుకుంది. ఒక నట శిఖరం దివికేగడంతో సినీ లోకం మూగబోయింది. కృష్ణ మరణం తెలుగు సమాజాన్ని దుఃఖసాగరంలో నింపింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్‌. కృష్ణ భౌతికాయాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక తండ్రి నిర్జీవంగా పడిఉండటాన్ని చూసి ఉబికివస్తున్న కన్నీటిని దిగమింగుకొని దీనంగా చూస్తూ ఉండిపోయారు. ఇక సినీ ప్రముఖులు ఒకొక్కరిగా మహేష్ ను ఓదారుస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కృష్ణ పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మహేష్ ను ఓదార్చారు. రాఘవేంద్రరావుని పట్టుకొని మహేష్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. వెక్కి వెక్కి ఏడ్చారు మహేష్. మహేష్ అలా చూసి తట్టుకోవడం కష్టమే.. నిన్న కార్డియాక్‌ అరెస్ట్‌తో కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు కృష్ణ. ఆస్పత్రిలో చేరే సమయానికే అపస్మారక స్థితిలో ఉన్నారు. మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌గా చెప్పిన వైద్యులు.. కండీషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 48 గంటలు గడిస్తేనే ఏ సంగతి చెప్పగలమని ముందుగా వెల్లడించిన వైద్యులు.. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ కన్నుమూసినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి