
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ఎంతో మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు జక్కన. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో బల్క్ బాడీతో కనిపించనున్నాడు మహేష్ బాబు. ఇక మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహేష్ కూతురు సితారకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిన్నారి పలు యాడ్స్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
మహేష్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఇన్ స్టాలో డ్యాన్స్ వీడియోస్.. ఫోటోస్, షేర్ చేస్తుంటుంది. సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు ఇదివరకే వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే పలు యాడ్స్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఓ జ్యువెల్లరీ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న సితార..మొన్న మధ్య తన తండ్రితో కలిసి మరో యాడ్ చేసింది. మహేష్ బాబు, సితార కలిసి ట్రెండ్స్ కంపెనీకి సంబంధించిన యాడ్ చేశారు. ఇక సోషల్ ,మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది.
” ఫేక్ అకౌంట్స్ తో జాగ్రత్తగా ఉండండి.. ఈ విషయం నా నోటిస్ కు వచ్చింది. నాపేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ సోషల్ మీడియాలో ఉన్నాయని తెలుస్తుంది. నేను నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నన్ను అభిమానించే వారికి ఓ క్లారీటీ ఇవ్వాలనుకుంటున్నా.. నాకు ఒకే ఒక్క అకౌంట్ ఉంది. నేను కేవలం ఇన్ స్టా గ్రామ్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటా.. ఇది నా అఫీషియల్ అకౌంట్. ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ లో నాకు అకౌంట్స్ లేవు.. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అంటూ పోస్ట్ షేర్ చేసింది సితార. ఈ పోస్ట్ పై మహేష్ బాబు అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సీతూ పాప జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.