Mahesh Babu: లేటుగా అయినా లేటెస్ట్ గా.. సీఎం రేవంత్‌ రెడ్డికి అభినందనలు తెలిపిన మహేశ్‌ బాబు

టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మంచు మనోజ్‌, యంగ్ హీరో నిఖిల్‌, డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ.. ఇలా పలువురు సినీ ప్రముఖులు రేవంత్‌ రెడ్డికి విషెస్‌ తెలిపారు. అయితే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాస్త లేట్‌గా తెలంగాణ కొత్త సీఎంకు అభినందనలు తెలిపారు.

Mahesh Babu: లేటుగా అయినా లేటెస్ట్ గా.. సీఎం రేవంత్‌ రెడ్డికి అభినందనలు తెలిపిన మహేశ్‌ బాబు
Cm Revanth Reddy, Mahesh Babu

Updated on: Dec 08, 2023 | 7:16 PM

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గురువారం (డిసెంబర్‌ 7) ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు రేవంత్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మంచు మనోజ్‌, యంగ్ హీరో నిఖిల్‌, డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ.. ఇలా పలువురు సినీ ప్రముఖులు రేవంత్‌ రెడ్డికి విషెస్‌ తెలిపారు. అయితే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కాస్త లేట్‌గా తెలంగాణ కొత్త సీఎంకు అభినందనలు తెలిపారు. ‘తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు.. మీరు రాష్ట్రాన్ని విజయం, శ్రేయస్సు, అభివృద్ధి కొత్త శిఖరాల వైపు నడిపించాలి’ అని ట్వీట్‌ చేశాడు మహేశ్‌ బాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. కాగా భరత్ అనే నేను సినిమాలో మహేశ్‌ బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన నటన అందరి మెప్పు పొందింది. ముఖ్యంగా ‘భరత్ అను నేను’ డైలాగ్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా తన మొదటి రోజుకు అనుభవాలకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. మహేశ్‌ బాబు ‘భరత్ అనే నేను’ బీజీఎమ్‌తోనే ఈ వీడియో రూపొందడం విశేషం. ‘తొలి రోజు సచివాలయంలో ఆశీర్వచనాలు, అభినందనల మధ్య తొలి రోజు ప్రజా పాలన మొదలైంది. పరిపాలనా కేంద్రమైన సచివాలయం ఇక ప్రజా పాలన కేంద్రంగా మారబోతోంది. అభినందనలు తెలిపిన సహచర మంత్రులు, అధికార గణానికి ధన్యవాదాలు’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నారు మహేశ్‌ బాటు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన దమ్ మసాలా మాస్ సాంగ్ చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబు ట్వీట్..

భరత్ అను నేను సాంగ్ తో రేవంత్ రెడ్డి వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.