AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శేఖర్ మాస్టర్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మహేశ్‌బాబు

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో సంక్రాంతి పండుగకి మంచి హిట్ అందుకున్నారు. పరాజయం అంటూ ఎరుగని అనిల్ రావిపూడి ఈ మూవీని డైరెక్ట్ చెయ్యగా..రష్మిక మందనా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నాడు సూపర్‌స్టార్. మరోవైపు కలెక్షన పరంగా కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ము రేపుతోంది. రిలీజైన మూడు రోజుల్లోగా 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసినట్టు మూవీ టీం అఫిషియల్‌గా ప్రకటించింది. పండుగ సెలవలు ఇంకా చాలా రోజులు ఉండటంతో మహేశ్ […]

శేఖర్ మాస్టర్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మహేశ్‌బాబు
Ram Naramaneni
|

Updated on: Jan 15, 2020 | 9:34 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో సంక్రాంతి పండుగకి మంచి హిట్ అందుకున్నారు. పరాజయం అంటూ ఎరుగని అనిల్ రావిపూడి ఈ మూవీని డైరెక్ట్ చెయ్యగా..రష్మిక మందనా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నాడు సూపర్‌స్టార్. మరోవైపు కలెక్షన పరంగా కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ము రేపుతోంది. రిలీజైన మూడు రోజుల్లోగా 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసినట్టు మూవీ టీం అఫిషియల్‌గా ప్రకటించింది. పండుగ సెలవలు ఇంకా చాలా రోజులు ఉండటంతో మహేశ్ ఈ సారి 200 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సినిమాపై మరింత బజ్ పెంచేందుకు రోజుకో ప్రమోషన్ వీడియోను రిలీజ్ చేస్తోంది మూవీ యూనిట్. అందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేశ్ నుంచి సమాధానాలు రాబట్టాడు డైరెక్టర్ అనిల్. ఇందులో చాలా ప్రశ్నలే ఉన్నాయి. అయితే అన్నింటిని పక్కనబెడితే మూవీలోని మైండ్ బ్లాంక్ పాటకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ విషయాన్ని హీరోనే స్పష్టం చేశాడు. తన కెరీర్ ఇంతలా డ్యాన్స్ గురించి మాట్లాడటం ఫస్ట్ టైమ్ వింటున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఓ ఫ్యాన్ సదరు పాటలోని స్టెప్పులను ప్రశంసిస్తూ, ఆ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫి చేసిన శేఖర్ మాస్టర్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరారు. మహేశ్,  అభిమాని సజీషన్‌కు పండగ చేసుకునే రిప్లై ఇచ్చాడు. ఇకపై వచ్చే తన చిత్రాల్లో కనీసం రెండు పాటలకు శేఖర్ మాస్టర్‌తోనే కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఏది ఏమైనా  శేఖర్ మాస్టర్‌కు ఇది బంఫర్ ఆఫరనే చెప్పాలి.

Follow Us