సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటేస్ట్ సినిమా సర్కారు వారి పాట. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా వసూళ్ల విషయంలోనూ తగ్గడం లేదు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లోనూ మహేష్ మేనియా కొనసాగుతుంది. ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సర్కారు వారి పాట.. ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.
మహేష్.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. మరోవైపు ఈ మూవీలోని ప్రతి పాట యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్‌తో సాధించి సెన్సెషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా తర్వాత మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాబోతుంది.
ట్వీట్..
Super ? @urstrulyMahesh‘s SWAG SEASON continues ??#BlockbusterSVP ??#SVPMania #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/mWZ9u6xo8s
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2022