Mad Movie OTT: ఓటీటీలోకి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
రీసెంట్ డేస్ లో అలా వచ్చిన సినిమాల్లో మ్యాడ్ సినిమా ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా నటించిన మ్యాడ్ మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటించాడు.

చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న. రీసెంట్ డేస్ లో అలా వచ్చిన సినిమాల్లో మ్యాడ్ సినిమా ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా నటించిన మ్యాడ్ మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటించాడు. మరో హీరోగా రామ్ నితిన్ నటించాడు. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మ్యాడ్ సినిమా రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. నెట్ ప్లిక్స్ లో మ్యాడ్ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
నవంబర్ మొదటి వారంలో ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మ్యాడ్ కథ ఏంటంటే..మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్‌శోభన్) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవుతారు. ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. అమ్మాయిల విషయంలో ముగ్గురు వేరు వేరుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఈ ముగ్గురి లైఫ్ లోకి జెన్నీ(అనంతిక), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), , రాధ (గోపిక ఉద్యాన్) వస్తారు. ఈ ముగ్గురి వల్ల అశోక్, మనోజ్, దామోదర్ జీవితాలు ఎలా మారిపోయాయి..?ఎలాంటి మలుపులు తిరిగాయి? కాలేజ్ లో ఈ ముగ్గురికి ఎలాంటి గొడవలు వచ్చాయి? అన్నదే ఈ సినిమా కథ.
View this post on Instagram
సంగీత్ శోభన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..