Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: పైత్యం ముదిరింది.. రచ్చ రచ్చ చేసిన రైతుబిడ్డ.. ఎవడికీ భయపడేది లేదు అంటూ..

మొన్నటివరకు హౌస్ లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేసిన బిగ్ బాస్. ఇప్పుడు అందరు ఒక్కటే అని అన్నారు. ఇక నామినేషన్స్ లో యావర్ కెప్టెన్ కావడంతో అతడిని ఎవ్వరూ నామినేట్ చేయకూడదని చెప్పారు బిగ్ బాస్. ఇక మిగిలిన వారిని గార్డెన్ ఏరియాకు రమ్మని వారి ముందు కుండలను పెట్టి ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్. దాంతో నామినేషన్స్ హీట్ పెరిగింది.

Bigg Boss 7 Telugu: పైత్యం ముదిరింది.. రచ్చ రచ్చ చేసిన రైతుబిడ్డ.. ఎవడికీ భయపడేది లేదు అంటూ..
Bigg Boss 7
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 17, 2023 | 7:13 AM

బిగ్ బాస్ లో నామినేషన్స్ షురూ అయ్యాయి. సోమవారం కావడంతో నామినేషన్ మొదలయ్యాయి. ప్రతివారం లానే ఈ వారాం కూడా నామినేషన్స్ హాట్ హాట్ గా జరిగాయి. మొన్నటివరకు హౌస్ లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేసిన బిగ్ బాస్. ఇప్పుడు అందరు ఒక్కటే అని అన్నారు. ఇక నామినేషన్స్ లో యావర్ కెప్టెన్ కావడంతో అతడిని ఎవ్వరూ నామినేట్ చేయకూడదని చెప్పారు బిగ్ బాస్. ఇక మిగిలిన వారిని గార్డెన్ ఏరియాకు రమ్మని వారి ముందు కుండలను పెట్టి ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాలనీ చెప్పాడు బిగ్ బాస్. దాంతో నామినేషన్స్ హీట్ పెరిగింది. ముందుగా పల్లవి ప్రశాంత్ తో మొదలు పెట్టారు. పల్లవి ప్రశాంత్ సందీప్ ను, తేజను నామినేట్ చేశాడు. బెలూన్ టాస్క్ లో సందీప్ చెప్పిన రీజన్ నచ్చలేదు అని ప్రశాంత్ అన్నాడు. దాంతో సందీప్ ప్రశాంత్ మధ్య వార్ జరిగింది.

సందీప్ ఓపికగా ఆన్సర్స్ చెప్పుతున్నాకూడా ప్రశాంత్ వినలేదు. సడన్ గా సైకోల మారిపోయాడు ప్రశాంత్. పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తూ వెరైటీగా ప్రవర్తించాడు. నీపై సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది.. కాస్త తగ్గించు’ అని సందీప్ అనడంతో ప్రశాంత్ మరింత రెచ్చిపోయాడు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. వెటకారం కాస్త ఎక్కువే అయ్యింది. సందీప్ ను నామినేట్ చేసి కుండపగల కొట్టాడు.

కెప్టెన్ రూంలోకి వచ్చినప్పుడు.. తన పర్మిషన్ తీసుకోకుండా రావడం తనకి నచ్చలేదని అన్నాడు ప్రశాంత్ రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. దానికి తేజ బాబు నేను దానికి పనిషమెంట్ కూడా తీసుకున్నారా అని చెప్పిన కూడా ప్రశాంత్ వినలేదు. ఎవడు అని అన్నవాడికి? నా సమాధానం పల్లవి ప్రశాంత్.. పల్లవి ప్రశాంత్ అంటూ హంగామా చేశాడు. నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో పల్లవి ప్రశాంత్ ప్రవర్తన ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పించింది. ఆతర్వాత సందీప్ , తేజ కూడా ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. దాంతో మరోసారి ప్రశాంత్ గొడవకు దిగాడు. కొట్టూ.. కొట్టావ్ గా.. ఎవడికీ భయపడేది లేదు అంటూ అరిచి గోల చేశాడు ప్రశాంత్.

బిగ్ బాస్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..