Vishnu Vs Prakash Raj: విష్ణుకి ప్లస్ అయిన అంశాలు.. ప్రకాష్ రాజ్‌కి మైనస్ అయిన అంశాలు ఇవే..

Vishnu Vs Prakash Raj: హోరా హోరీగా సాగిన మా అధ్యక్ష పీఠంపై మంచు వారి అబ్బాయి విష్ణుని కూర్చోబెట్టారు. ప్రకాష్ రాజ్ పై విష్ణు భారీ ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకున్నారు..

Vishnu Vs Prakash Raj: విష్ణుకి ప్లస్ అయిన అంశాలు.. ప్రకాష్ రాజ్‌కి మైనస్ అయిన అంశాలు ఇవే..
Vishnu Prakash Raj

Edited By:

Updated on: Oct 10, 2021 | 10:08 PM

Vishnu Vs Prakash Raj: హోరా హోరీగా సాగిన మా అధ్యక్ష పీఠంపై మంచు వారి అబ్బాయి విష్ణుని కూర్చోబెట్టారు. ప్రకాష్ రాజ్ పై విష్ణు భారీ ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణులోని బలాలు బలహీనతలు ఏమిటో చూద్దాం..

ముందుగా ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు బలాల విషయానికి వస్తే.. మోహన్ బాబు కొడుకు అన్నది అతి పెద్ద ప్లస్ పాయింట్. ఇక
ఇండస్ట్రీలో తండ్రి మోహన్ బాబు సాయంతో ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల మద్దతుని సంపాదించుకున్నారు. ఇక యువకుడు ..
విద్యా సంస్థలు నడుపుతున్న అనుభవం ఉంది. అన్నిటికంటే తెలుగువాడినన్న ప్రచారం బాగా పనిచేసింది అన్న టాక్ వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీ కి రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంది మంచి మేనిఫెస్టో తో ‘మా’ సభ్యులను కట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మంచు విష్ణుకి మా సభ్యులు పట్టం గట్టారు.

మా అధ్యాకుడిగా పోటీలో నిలిచి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ లోని  బలహీనతలను ప్రస్తావిస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది నాన్ లోకల్.. ఇక యాంటీ హిందూ అనే వాదన.. అంతేకాదు ప్రకాష్ రాజ్ కోపిష్టి ముద్ర కూడా ఉంది. అంతేకాదు  ఆవేశంపరుడు.. ఇక నడిగార్ సంఘంలో వివాదాలుకూడా ఉన్నాయి. ఇక గతంలో ప్రకాష్ రాజ్ మా నుంచి సస్పెండ్ అయిన చరిత్ర కూడా ఉంది. ముఖ్యంగా మేనిఫెస్టో పై క్లారిటీ మిస్ అయిందనే టాక్ ఉంది.

Also Read:

మంచుకే ‘మా’ పీఠం… ఉత్కంఠ పోరులో విష్ణు విజయం…