Prakash Raj Vs Manchu Vishnu: మా(MAA) అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంజు విష్ణు తలపడుతున్నారు. నాలుగైదు రోజుల క్రితం వరకు అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలిచే అవకాశముందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ తర్వాత మంచు విష్ణు క్రమంగా పుంజుకుని.. ప్రకాష్ రాజ్‌కు బలమైన పోటీ ఇస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గం.ల నుంచి మా ఎన్నికల పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గం.ల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి..రాత్రికల్లా ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
మరికొన్ని గంటల్లో మా అధ్యక్ష పదవి ప్రకాష్ రాజ్, మంచు విష్ణులో ఎవరిని వరించనుందో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపనున్న ప్రకాష్ రాజు, మంచు విష్ణుల బలాలు బలహీనతలు ఏంటో ఓ సారి చూద్దాం.
ప్రకాష్‌రాజ్-బలాలు
మెగాప్యామిలీ సపోర్టు
సామాజిక అవగాహన
దర్శక నిర్మాతలతో బాగా పరిచయాలు
రెండు నెలల ముందుగానే ప్యానెల్
విజన్ తో అందరినీ ఒప్పించడం
అన్ని ఇండస్ట్రీలను చూసిన అనుభవం
బలమైన ప్యానెల్
ప్రకాష్‌రాజ్- బలహీనతలు
నాన్ లోకల్
యాంటీ హిందూ అనే వాదన
కోపిష్టి ముద్ర, ఆవేశం
నడిగార్ సంఘంలో వివాదాలు
మా నుంచి సస్పెండ్ అయిన చరిత్ర
ఎన్నికల్లో ఓటమి చరిత్ర
మేనిఫెస్టో పై క్లారిటీ మిస్
మంచు విష్ణు – బలాలు
మోహన్ బాబు కొడుకు
ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల మద్దతు
యువకుడు
విద్యా సంస్థలు నడుపుతున్న అనుభవం
తెలుగువాడినన్న ప్రచారం
రాజకీయ పార్టీలతో అనుబంధం
మహిళలకు పెద్దపీట
మంచి మేనిఫెస్టో
మంచు విష్ణు – బలహీనతలు
అనుభవం లేదనే అభిప్రాయం
దూకుడు, రాజకీయ ప్రస్తావన
పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు
మెగా కుటుంబం మద్దతు లేకపోవడం
కులాన్నే నమ్ముకున్నారన్న విమర్శ
లోకల్, నాన్ లోకల్ వివాదం
మేనిఫోస్టోపై మంచు విష్ణు ఆశలు..
మంచు విష్ణు మా ఎన్నికల కోసం మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోనే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తంచేస్తోంది మంచు ప్యానల్. మేనిఫెస్టోలో హామీని విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉందని మంచు మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
విష్ణు మేనిఫోస్టోలోని అంశాలు ఇవే..
అవకాశాల కోసం యాప్, జాబ్ కమిటీ ఏర్పాటు
సొంత ఖర్చులతో MAA భవనం
ప్రభుత్వ సహకారంతో సొంతింటి కల సాకారం
హెల్త్ పాలసీ ఖర్చు సభ్యులపై లేకుండా చేస్తాం
మూడు నెలల కు ఒకసారి హెల్త్ క్యాంప్
అర్హులైన పిల్లలకు KG నుండి PG ఉచిత విద్య
పిల్లల వివాహానికి రూ.లక్ష 16 వేలు
మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ని ఏర్పాటు… మెంబర్స్ పిల్లలకి 50 శాతం స్కాలర్ షిప్
సభ్యులుగా లేనివారికి కొత్తగా మెంబర్‌షిప్
మెంబర్ షిప్ రూ.లక్ష నుంచి రూ. 75వేలు తగ్గిస్తాం
దేశంలోనే గర్వపడే విధంగా అసోసియేషన్
Also Read..
MAA Elections 2021: బజారున పడి నవ్వుల పాలవుతున్నారు.. మా ఎలక్షన్స్ పై మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Crocodile in moosi: మూసీలో మొసలి కలకలం… భయాందోళనలో స్థానికులు