Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: బజారున పడి నవ్వుల పాలవుతున్నారు.. మా ఎలక్షన్స్ పై మోహన్ బాబు సంచలన కామెంట్స్..

మా...ఎన్నికలు క్లైమాక్స్‌కి చేరాయి. బరిలో ఉన్న అభ్యర్థులు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌‏లు తమ ప్యానెళ్లతో కలిసి ముమ్మర ప్రచారాన్ని మొదలుపెట్టాయి

MAA Elections 2021: బజారున పడి నవ్వుల పాలవుతున్నారు.. మా ఎలక్షన్స్ పై మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Mohan Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 09, 2021 | 3:27 PM

మా…ఎన్నికలు క్లైమాక్స్‌కి చేరాయి. బరిలో ఉన్న అభ్యర్థులు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌‏లు తమ ప్యానెళ్లతో కలిసి ముమ్మర ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఒక్కొక్కరు ఒక్క దారిని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు.. ఒకవైపు కొందరు సినీ పెద్దలు కలుస్తుంటే…మరికొందరు సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక మా ఎన్నికల పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సారి మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్నారు. ఆరోపణలు, నిందలు, విమర్శలు, వార్నింగ్స్ తారాస్థాయికి చేరాయి. ఎన్నికల పరంగానే కాకుండా..మరికొందరు సభ్యులు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారు. రేపు (అక్టోబర్) 10న మా ఎన్నికలు కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగం చేశారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు మోహన్‌బాబు మా ఎన్నికలపై తనదైన స్టైల్లో ఓ ఆడియో రిలీజ్‌ చేశారు.

ఏకగ్రీవంగా జరగాల్సిన మా ఎన్నికలు…కొందరు సభ్యుల వల్ల రచ్చకెక్కాయన్నారు మోహన్‌బాబు. తన బిడ్డ మంచు విష్ణును గెలిపించాలని మా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్న హామీలను తప్పక విష్ణు నెరవేరుస్తారనే నమ్మకం తనకుందన్నారు. ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మోహన్‌బాబు. కొందమంది సభ్యులు బజారున పడి నవ్వుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మంచు విష్ణు గెలిచిన వెంటనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి కష్టాసుఖాలను చెప్పుకుని సహాయ సహకరాలు తీసుకుందామని కోరారు. రేపు జరగబోయో ఎన్నికలలో ఆర్టిస్టులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మోహన్ బాబుకు సంబంధించిన ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Pelli Sandadi: శ్రీకాంత్ తనయుడి కోసం రంగంలోకి ఆ స్టార్ హీరోలు.. పెళ్లి సందD ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథులు ఎవరంటే..

MAA Elections 2021: ‘తెర’వెనుక రాజకీయం.. ఇప్పుడే మొదలైన అసలు సిసలు ‘మా’ యుద్ధం

MAA Elections 2021: క్లైమాక్స్‌కి చేరిన ‘మా’ ఫైట్.. మోనార్క్ vs మంచు ప్యానళ్లు ఢీ అంటే ఢీ.. 28 ఏళ్ల ‘మా‘ ప్రస్థానం సాగిందిలా..

Iswarya Menon: క్యూట్ క్యూ స్మైల్‌తో కవ్విస్తున్న ఎల్లోరా శిల్పం.. అందాల ఐశ్వర్య మీనన్ ఫొటోస్..