MAA Elections 2021: ‘మా’ అధ్యక్ష పోరులో మరో మహిళ.. రేస్‌లోకి సీనియర్ నటి హేమ

|

Jun 23, 2021 | 4:57 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. 'మా' అధ్యక్ష ఎన్నికలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి.  రాజకీయం వేడెక్కుతుంది. అధ్యక్ష పదవికి బరిలో దిగిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్​లు....

MAA Elections 2021: మా అధ్యక్ష పోరులో మరో మహిళ.. రేస్‌లోకి సీనియర్ నటి హేమ
Hema In Maa Elections
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి.  రాజకీయం వేడెక్కుతుంది. అధ్యక్ష పదవికి బరిలో దిగిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్​లు ఎవరికి వారే ఎన్నికల్లో గెలిచేందుకు తమ గేమ్ ప్లాన్స్ అమలుచేస్తున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్ మద్దతుతో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండగా.. తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఇక జీవిత రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు.  ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయనటి హేమ కూడా ‘మా’ అధ్యక్ష పదవి రేస్‌లోకి దూసుకొచ్చారు. గతంలో మా అసోసియేషన్ లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పనిచేసిన హేమ.. మహిళా నటీమణుల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఎలక్షన్స్ లో తొలుత ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్న హేమ.. తనవారి కోసం అధ్యక్ష పదవి రేస్‌లోకి దిగబోతున్నట్లు స్పష్టం చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి ఇప్పటికి 26 ఏళ్లవుతుంది. అందులో ప్రస్తుతం 926 మంది సభ్యులున్నారు. తొలిసారిగా ఈ అసోసియేషన్ కు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో సీనియర్ నటులు మోహన్ బాబు, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్ పనిచేశారు. కాగా రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య పోటీ జరిగిన సమయంలో ‘మా’  ఎలక్షన్స్ రసవత్తరంగా మారి సాధారణ ఎన్నికలను తలపించాయి.  ఆ తర్వాత సీనియర్ నటులు నరేశ్​, శివాజీ రాజాల మధ్య ఫైట్ జరిగినప్పుడు మాటల యుద్దాలు నడిచాయి. గత ఎన్నికల్లో నరేశ్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో ఈ దఫా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేయనుండటం వల్ల ముచ్చటగా మూడోసారి రసవత్తరంగా మారనున్నాయి.

Also Read: బ్యాంక్‌ లాకర్‌కు మరమ్మత్తు చేశాడు.. కన్నం వేశాడు.. ! కానీ ఎక్కడ బెడిసికొట్టిందంటే..?

అతడి శరీరం అయస్కాంతంలా మారిపోయింది.. స్టీల్ ప్లేట్లు, ఇనుప వస్తువులు ఇట్టే అతుక్కుపోతున్నాయ్