Chandrabose: అరుదైన గౌరవం అందుకున్న లిరిసిస్ట్ చంద్రబోస్.. నాటు నాటు సాంగ్‌కు..
నెల రోజులుగా ఇండియాలోనూ ఆస్కార్ హంగామా కనిపిస్తుంది. ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అవ్వడమే గొప్ప విషయం అనుకుంటే.. ఏకంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో టాప్ 5లో చోటు దక్కించుకుని అవార్డుకు అడుగు దూరంలో నిలిచింది
![Chandrabose: అరుదైన గౌరవం అందుకున్న లిరిసిస్ట్ చంద్రబోస్.. నాటు నాటు సాంగ్‌కు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/chandrabose.jpg?w=1280)
సాధారణంగా ఆస్కార్ అంటే ఇండియాలో పెద్దగా సందడి ఉండదు. అదంతా ఫారెన్ సినిమా వాళ్ల పండగ అనుకునేవాళ్లు. ఏదో ఆ సినిమాకు వచ్చిందంట.. ఆ హీరోకు వచ్చిందంట అని మాట్లాడుకోవడమే కానీ.. మన సినిమా కూడా నామినేషన్స్‌లో ఉంటుందనే విషయమే తెలియదు. అలాంటిది ట్రిపుల్ ఆర్ దాన్ని చేసి చూపించింది. అందుకే నెల రోజులుగా ఇండియాలోనూ ఆస్కార్ హంగామా కనిపిస్తుంది. ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అవ్వడమే గొప్ప విషయం అనుకుంటే.. ఏకంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో టాప్ 5లో చోటు దక్కించుకుని అవార్డుకు అడుగు దూరంలో నిలిచింది మన ట్రిపుల్ ఆర్. దాంతో కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినిమా అంతా ట్రిపుల్ ఆర్ సినిమా వైపు ఆసక్తిగా వేచి చూస్తుంది.
బాహుబలితో ఇండియన్ సినిమాను మాత్రమే షేక్ చేసిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఈ మధ్యే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన ఈ చిత్రం.. తాజాగా ఆస్కార్ బరిలోనూ ఉంది. అయితే నాటు నాటు పాటను అద్భుతంగా రచించిన చంద్రబోస్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.
ప్రస్తుతం చంద్రబోస్ అమెరికాలో ఉన్నారు. లాస్ ఏంజెల్స్ లో జరిగే ఆస్కార్ వేడుకకు ఆయన హాజరు కానున్నారు. కాగా చంద్రబోస్ సైతం ప్రముఖ హాలీవుడ్ చానెళ్ల లైవ్ లలో హైలైట్ అవుతున్నారు. వరుస ఇంటర్వ్యూల్లో నాటు నాటు సాంగ్ గురించి వివరిస్తున్నారు. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ అండ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రతిమలను తాను కూడా అందుకుని ముద్దాడుకున్న ఆనందాన్ని చంద్రబోస్ మీడియాతో షేర్ చేసుకున్నారు.