
గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషకం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే లిప్‌లాక్ సీన్‌లో నటించందనే కారణంతో ఓ హీరోయిన్‌కు తన ప్రియుడు బ్రేకప్ చెప్పేశాడు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు సిమ్రాన్. ఇప్పటి తరానికి సిమ్రాన్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో అభిమానులకు సిమ్రాన్ క్రేజ్ తెలిసే ఉంటోంది. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన సిమ్రాన్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు వంటి హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారామె.
దాదాపు ఐదేళ్లు పాటు తెలుగులో టాప్ హీరోయిన్‌గా సిమ్రాన్ నిలిచారు. అయితే సిమ్రాన్ టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాజ సుందరంతో ప్రేమలో పడిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. సిమ్రాన్ రాజు సుందరంని చాలా గాఢంగా ప్రేమించిందట. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుందనుకునే సమయంలో వీరిద్దరు విడిపోయారు. అయితే ఓ సినిమాలోని లిప్ కిస్ కారణంగా వీరిద్దరు విడిపోయారని తెలుస్తోంది. సిమ్రాన్ అప్పట్లో కమల్ హాసన్‌తో వరుస సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, పంచతంత్రం, పమ్మల్ కె.సంబంధం వంటి సినిమాల్లో కమల్ హాసన్‌తో సిమ్రాన్ కలిసి నటించారు.
ఆ సమయంలోనే కమల్‌తో సిమ్రాన్ రిలేషన్‌లో ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో కమల్‌తో కలిసి సిమ్రాన్ ఓ లిప్‌లాక్ సన్నివేశంలో నటించింది. దీంతో సిమ్రాన్‌ను కమల్‌కు దూరంగా ఉండాలని రాజ సుందరం ఆదేశించాడట. అయినప్పటికి కమల్ తో సిమ్రాన్ క్లోజ్‌గా మూవ్ కావడంతో ఆమెకు రాజ సుందరం బ్రేకప్ చెప్పాడట. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా రాజ సుందరం ఇలా చేయడంతో సిమ్రాన్ కొన్నాళ్లు బాధపడిందట. రాజ సుందరంతో బ్రేకప్ తర్వాత సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో పలు షోలకు సిమ్రాన్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు.