AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులు మాములుగా లేవు.. ఎక్కడ చూడొచ్చంటే?

ఈ మధ్యన కొన్ని సినిమాలు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే థియేటర్లలో రిలీజై ఇప్పటికీ డిజిటల్ స్ట్రీమింగ్ కు నోచుకోని కొన్ని చిత్రాలు కూడా సడెన్ గా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అలా తాజాగా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులు మాములుగా లేవు.. ఎక్కడ చూడొచ్చంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 01, 2025 | 11:30 AM

Share

హనుమాన్ ఫేమ్, ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మధుశాల. జి.సుధాకర్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రంజాన్ కానుకగా సోమవారం (మార్చి 31) ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు మనోజ్ నందం, యానీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, గెటప్ శీను, చిన్నా, రవివర్మ, ఇనయా సుల్తానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఐఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తమ్ముడు సత్యం నిర్మించిన ఈ మూవీకి సెబాస్టియన్ వర్గీస్ సంగీతం అందించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా మంగళవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. . ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘మధుశాల.. ఓ ఇంటెన్స్ థ్రిల్లింగ్ కిడ్నాప్ డ్రామా. ఓ ప్లాన్, షాకింగ్ ట్విస్ట్, టైమ్‌తో రేస్. కిడ్నాపర్లను పట్టుకుని ఎమ్మెల్యే తనకు ఇష్టమైన వ్యక్తులను కాపాడుకున్నాడా.?’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది ఈటీవీ విన్.

మధుశాల సినిమా కథేంటంటే..

ఇవి కూడా చదవండి

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కోడలిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు ఒక కిడ్నాపర్. ఇందుకోసం మరో ఐదుగురిని సాయం తీసుకుంటాడు . ప్లాన్ ప్రకారమే అందరూ కలిసి ఎమ్మెల్యే కోడలిని కిడ్నాప్ చేస్తారు. అయితే, ఈ క్రమంలో కిడ్నాపర్లలో ఒకరు అనుకోకుండా యాక్సిడెంట్‍లో చనిపోతాడు. అసలు ట్విస్ట్ అక్కడే ఎదురవుతుంది. మరి కిడ్నాప్ సంగతి ఏమైంది? కిడ్నాపర్ల నుంచి తన కోడలిని ఎమ్మెల్యే కాపాడుకోగలిగారా? ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, కిడ్నాపర్లకు ఎదురైన పరిస్థితులేంటి? అన్నది తెలుసుకోవాలంటే మధుశాల సినిమా చూడాల్సిందే

ఈటీవీ విన్ లో వరలక్ష్మి సినిమా స్ట్రీమింగ్..

ఈటీవీ విన్ లోని మరిన్ని సినిమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బోర్‌వెల్‌లో చిన్నారి.. రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు!
బోర్‌వెల్‌లో చిన్నారి.. రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు!
వారంలో ఈ రోజు డీమార్ట్‌కు వెళితే బిల్లు సగానికి తగ్గుతుందా..?
వారంలో ఈ రోజు డీమార్ట్‌కు వెళితే బిల్లు సగానికి తగ్గుతుందా..?
కష్టాల్లో ఉన్నారా? నవరాత్రుల్లో చండీ హోమం గురించి తెలుసా?
కష్టాల్లో ఉన్నారా? నవరాత్రుల్లో చండీ హోమం గురించి తెలుసా?
నకిలీ ULC లెటర్లతో సర్కార్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు..!
నకిలీ ULC లెటర్లతో సర్కార్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు..!
Viral Video: గాల్లోకి ఎగిరిన టెస్లా కారు! ఫ్లయింగ్‌ కారు సాధ్యమే.
Viral Video: గాల్లోకి ఎగిరిన టెస్లా కారు! ఫ్లయింగ్‌ కారు సాధ్యమే.
పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు శ్రీమంతం చేసిన సిబ్బంది!
పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు శ్రీమంతం చేసిన సిబ్బంది!
బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసే బ్రడ్ రసమలై రెసిపీ..
బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసే బ్రడ్ రసమలై రెసిపీ..
చలికాలంలో ఎండు కొబ్బరి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
చలికాలంలో ఎండు కొబ్బరి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
హోమ్ కుక్ కావాలా? ఆన్‌లైన్‌లో కొత్త స్కామ్ కలకలం..అడ్వాన్స్ ఇస్తే
హోమ్ కుక్ కావాలా? ఆన్‌లైన్‌లో కొత్త స్కామ్ కలకలం..అడ్వాన్స్ ఇస్తే
వింత జీవిని పుట్టించి దాంతో అలాంటి పనులు
వింత జీవిని పుట్టించి దాంతో అలాంటి పనులు