
సూపర్ స్టార్ మహేష్ బాబుకు చిన్న.. పెద్ద అని తేడాలేకుండా అందరూ ఫ్యాన్స్ అయ్యి పోతారు.. ఇది ఆయన అభిమానులు చెప్పే మాట.. నిజమే మహేష్ బాబుకు ఫ్యాన్స్ కానివారు ఎవరుంటారు. పాన్ ఇండియా స్టార్ కాకపోయినా వరల్డ్ వైడ్ గా మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు.. అలాగే ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఆ కుటుంబాలకు దేవుడయ్యాడు. 1000కి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి వారికి అండగా నిలిచాడు. ఇంకా చిన్నారులకు సర్జరీలు చేయిస్తునే ఉన్నారు. విజయవాడలోని ఆంధ్ర హాస్పటల్స్ తో కలిసి చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి దైవం మానుష రూపేణ అన్న దానికి ఉదాహరణగా నిలుస్తున్నారు మహేష్. ఇదిలా ఉంటే మాటలు కూడా సరిగ్గా రాని ఓ చిన్నారికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ చిన్నారికి ఆమె తల్లి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః అంటూ శ్లోకాన్ని నేర్పిస్తుంది.. అందులో గురు దేవో మహేశ్వరః అని తల్లి అంటే ఆ చిన్నారి మాత్రం మహేష్ బాబు అని ముద్దుగా అంటుంది. కాదు మహేశ్వరః అన్నా కూడా ఆ చిన్నారి మహేష్ బాబు, మహేష్ బాబు అంటూ క్యూట్ గా మాట్లాడింది. తన తల్లిని వారిస్తూ అమ్మ.. మహేష్ బాబు అని ఆ చిన్నారి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. చిన్నారి కూడా మహేష్ బాబు అభిమానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అంతమంది చిన్నారులకు సాయం చేశాడు.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ లిటిల్ ఫ్యాన్ వీడియో ఇప్పుడు మహేష్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.