దసరా, దీపావళి తర్వాత పెద్ద హీరోల సందడి బాగా తగ్గిపోయింది. దీనిని క్యాష్ చేసుకుంటూ చిన్న సినిమాలు థియేటర్లలోకి పరుగులు పెడుతున్నాయి. వారానికి కనీసం ఐదారు కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. పేరుకే చిన్న సినిమాలైనా కొన్ని సినిమాలు కంటెంట్ విషయంలో వైవిధ్యంతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఆకట్టుకునే కంటెంట్‌తో ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. మరి నవంబర్ రెండో వారంలో విడుదల కానున్న థియేటర్/ఓటీటీ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
జాను తర్వాత సమంత నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం యశోద. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కోసమే సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లోనూ ఆమె నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న యశోద నవంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయశంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం నచ్చింది నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీఫర్ హీరోయిన్‌గా నటించింది. గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అమితాబ్‌బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, నీనా గుప్తా వంటి బాలీవుడ్ హేమాహేమీలు నటించిన చిత్రం ఊంచాయి. పరిణీతి చోప్రా, సారిక కీలక పాత్రలు పోషించారు. మైనే ప్యార్‌కియా, హమ్ ఆప్కే హై కౌన్, వివాహ్, ప్రేమ్‌రతన్ దన్ పాయో వంటి ప్రేమకథా కుటుంబ చిత్రాలను తెరెక్కించిన సూరజ్ బర్జాత్య దీనికి దర్శకత్వం వహించారు. నవంబరు 11న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది.
వీటితో పాటు నూతన హీరో, హీరోయిన్లు శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన లవ్ ఎంటర్‌టైనర్ మది కూడా 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో
జీ5
సోనీ లివ్
లయన్స్ గేట్ ప్లే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.