Vijay Deverakonda Liger: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలకు ముహూర్తం సమీపిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మరింత స్పీడ్ పెంచింది చిత్రబృందం. హీరో హీరోయిన్లు విజయ్, అనన్యా పాండే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తూ తమ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. కాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రూ.199 చెప్పులు ధరించి ట్రెండ్ సెట్ చేసిన రౌడీ బాయ్ ఆతర్వాత ఓ ప్రమోషన్ ఈవెంట్ కోసం హీరోయిన్ అనన్యతో కలిసి ఫ్లైట్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. ఇలా తన సింప్లిసిటీతో అభిమానుల మనసు గెల్చుకున్న విజయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
కాగా లైగర్ ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో నిర్వహించిన ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు ఆటో రిక్షాలో వచ్చాడు విజయ్. లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ జోరున వర్షంలోనే ఆటోలో గమ్య స్థానానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తెల్లటి దుస్తులు ధరించిన విజయ్ ఎంతో అందంగా కనిపించాడు. కాగా పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తోన్న లైగర్ సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు విజయ్. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో పాటు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ స్టోర్ట్స్ డ్రామా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..