Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప విడుదలైన అన్నీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప సినిమా డైలాగులే.. ఎక్కడ విన్నా పుష్ప మూవీ పాటలే. అంతలా ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరోసారి పెంచేసిందీ చిత్రం. అల్లు అర్జున్ అద్ధుమైన నటన, సుకుమార్ సూర్ డైరెక్షన్, దేవీ శ్రీ మెస్మరైజ్ మ్యూజిక్.. వెరసి ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. విడుదలైన అన్ని భాషల్లో అద్భుత టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాపై ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు పార్ట్ 2 పైన దృష్టి పెట్టారు అల్లు అర్జున్ సుకుమార్. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ తో సినిమా చేయడానికి బడా నిర్మాణ సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ తో ఒక భారీ సినిమాను నిర్మించేందుకు గాను లైకా ప్రొడక్షన్స్ వారు ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాకు గాను ఏకంగా బన్నీకి వంద కోట్ల పారితోషికంను ఆఫర్ చేసినట్లుగా ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బహుబాలి, సాహో సినిమాలతో వందకోట్ల రెమ్యునరేషన్ అందుకునే హీరోగా మారిపోయాడు. ఇప్పుడు బన్నీ కూడా ఆ స్థాయి పారితోషికంను లైకా వారి ద్వారా అందుకుంటున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :