AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balasubrahmanyam Third Death Anniversary: బాలు దూరమై మూడేళ్లయినా మదినిండా ఆయన పాటలే

పాటల సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు బాలసుబ్రహ్మణ్యం.  ఎన్నోయ్ వేళా పాటలను ఆలపించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు బాలు. నేడు ఆ మహానుభావుడు మరణించిన రోజు. బాలు ఈ లోకాన్ని విడిచి మూడేళ్లు అవుతుంది. ఆయన మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గానం మధురం.. బాషా ఏదైనా బాలు తన స్వరంతో పాటకు ప్రాణం పోస్తారు. దాదాపు 40 వేలకు పైగా పాటలను ఆలపించారు బాలు. కరోనా మహమ్మారి ఆ గానగంధర్వుడిని మన నుంచి దూరం చేసింది.

Balasubrahmanyam Third Death Anniversary: బాలు దూరమై మూడేళ్లయినా మదినిండా ఆయన పాటలే
Spb
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2023 | 12:13 PM

Share

తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన పేరు పలుకుతూనే ఉంటాం.. సంగీతం ఉన్నంత కాలం ఆయన గానం వినిపిస్తూనే ఉంటుంది. ఆయనే దిగ్గజ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. పాటల సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు బాలసుబ్రహ్మణ్యం.  ఎన్నోయ్ వేళా పాటలను ఆలపించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు బాలు. నేడు ఆ మహానుభావుడు మరణించిన రోజు. బాలు ఈ లోకాన్ని విడిచి మూడేళ్లు అవుతుంది. ఆయన మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గానం మధురం.. బాషా ఏదైనా బాలు తన స్వరంతో పాటకు ప్రాణం పోస్తారు. దాదాపు 40 వేలకు పైగా పాటలను ఆలపించారు బాలు. కరోనా మహమ్మారి ఆ గానగంధర్వుడిని మన నుంచి దూరం చేసింది. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. గాయకుడిగానే కాదు నటుడిగాను మెప్పించారు బాలు. ఆయన నటన హావభావాలు ప్రేక్షకులను ముగ్థులను చేశాయి.

సింగర్ గా నటుడిగానే కాదు చాల మంది నటులకు గాత్రదానం కూడా చేశారు బాలు. చాలా మంది నటులకు డబ్బింగ్ చెప్పారు బాలు. . కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ ల;ఆంటీ వారికి డబ్బింగ్ చెప్పారు బాలు. పాడుతా తీయగాలాంటి టీవీ షోకు హోస్ట్ గా వ్యవహరించి ఎంతో మంది నూతన గాయకులను ప్రోత్సహించారు బాలు. 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

అంతే కాదు 25సార్లు నంది అవార్డు ను కూడా సొంతం చేసుకున్నారు బాలు. బాలు కరోనా భారిన పడటంతో ఆయన హాస్పటల్ లో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే  2020 సెప్టెంబరు 25 న మధ్యాహ్నం 1.04 లకు బాలు తుదిశ్వాస విడిచారు. బాలు మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

బాలసుబ్రహ్మణ్యం చివరి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

బాలసుబ్రమణ్యం ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.