DD RETURNS :ఓటీటీకి వచ్చేసిన డీడీ రిటర్న్స్ తెలుగు వర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా ఇదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు  వచ్చింది ఓ సినిమా. ఆ సినిమా పేరే డీ డీ రిటర్న్స్ భూతాల బంగ్లా. కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతానం ఈ సినిమాలో హీరోగా నటించాడు. తమిళనాట సంతానం కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించాడు. ఇక డీ డీ రిటర్న్స్ సినిమా తమిళ్ లో ముందుగా రిలీజ్ అయ్యింది. అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగులోకి రిలీజ్ చేశారు.

DD RETURNS :ఓటీటీకి వచ్చేసిన డీడీ రిటర్న్స్ తెలుగు వర్షన్..  స్ట్రీమింగ్ ఎక్కడంటే
Dd Returns
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2023 | 11:25 AM

హారర్ కామెడి ఎంటర్టైనర్స్ కు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ దక్కుతోంది. హారర్ కామెడీ సినిమాలు ఎప్పుడు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఈ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా ఇదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు  వచ్చింది ఓ సినిమా. ఆ సినిమా పేరే డీ డీ రిటర్న్స్ భూతాల బంగ్లా. కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతానం ఈ సినిమాలో హీరోగా నటించాడు. తమిళనాట సంతానం కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించాడు. ఇక డీ డీ రిటర్న్స్ సినిమా తమిళ్ లో ముందుగా రిలీజ్ అయ్యింది. అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగులోకి రిలీజ్ చేశారు.

ఇక థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగు వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో డీ డీ రిటర్న్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమా మంచి వ్యూస్ దక్కుతున్నాయని తెలుస్తోంది. భయపెట్టే సన్నివేశాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఈ మూవీ ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

A post shared by ZEE5 Tamil (@zee5tamil)

డీ డీ రిటర్న్స సినిమాకు ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం దర్శకత్వం వహించారు. దిల్లుకు దుడ్డు ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది. ఇక ఈ సినిమాలో సంతానం కు జోడీగా బబ్లీ బ్యూటీ సురభి నటించింది. ఇక ఈ సినిమాలో ప్రదీప్ రావత్ , రెడిన్ కింగ్స్లీ లాంటి వారు నటించారు. ఆర్‌కె ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమాకు ఆఫ్‌రో సంగీతాన్ని అందించారు.

తమిళ్ నటుడు సంతానం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

View this post on Instagram

A post shared by ZEE5 Tamil (@zee5tamil)

సంతానం ఇన్ స్టా గ్రామ్ పోస్ట్.

View this post on Instagram

A post shared by ZEE5 Tamil (@zee5tamil)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.