Taraka Ratna: ‘ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేము’.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన తారకరత్న సతీమణి..

ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. ఇప్పటికే భర్తతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ తన బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలేఖ్య. తాజాగా మరోసారి తన భర్తను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Taraka Ratna: ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేము.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన తారకరత్న సతీమణి..
Taraka Ratna

Updated on: Apr 09, 2023 | 3:05 PM

నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన లేరన్న వార్తను అటు అభిమానులు.. ఇటు కుటుంబసభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అర్థాంతరంగా తనువు చాలించడం కలిచివేస్తుంది. తారకరత్న చనిపోయి సుమారు 2 నెలలు కావొస్తున్నా ఇంకా ఆయన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. ఇప్పటికే భర్తతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ తన బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలేఖ్య. తాజాగా మరోసారి తన భర్తను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

పిల్లలతో కలిసి తారకరత్న గడిపిన అందమైన క్షణాలను షేర్ చేస్తూ.. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేకపోతున్నాను అంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ అలేఖ్యరెడ్డికి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు.

ఇవి కూడా చదవండి

అనంతరం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించగా.. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు తారకరత్న..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.