Chef Mantra2 : శ్రీరామ్ చంద్రతో కలిసి సందడి చేసిన మంచు లక్ష్మీ.. చెఫ్ మంత్ర న్యూ ఎపిసోడ్ ప్రోమో

ఇక ఇప్పటికే సూపర్ గేమ్ షోస్ తో పాటు ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తోంది ఆహా. ప్రతివారం సూపర్ డూపర్ టాక్ షోలు, గేమ్ షోలతో పాటు వంట అంటే ఇష్టోపడే వారి కోసం చెఫ్ మంత్ర అనే షోను నిర్వహిస్తున్నారు.

Chef Mantra2 : శ్రీరామ్ చంద్రతో కలిసి సందడి చేసిన మంచు లక్ష్మీ.. చెఫ్ మంత్ర న్యూ ఎపిసోడ్ ప్రోమో
Chefmantra2

Updated on: Nov 08, 2022 | 5:18 PM

వంద శాతం తెలుగు కంటెంట్ తో దూసుకుపోతోన్న ఆహా ఇప్పటికే ప్రేక్షకుల మన్నలను అందుకుంటుంది. సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా. ఇక ఇప్పటికే సూపర్ గేమ్ షోస్ తో పాటు ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తోంది ఆహా. ప్రతివారం సూపర్ డూపర్ టాక్ షోలు, గేమ్ షోలతో పాటు వంట అంటే ఇష్టోపడే వారి కోసం చెఫ్ మంత్ర అనే షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నటి లక్ష్మీ ప్రసన్న మంచు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మంచి వ్యూస్ తో దూసుకుపోతోన్న ఈ షోలో సినిమా తారలు తమకు ఇష్టమైన వంటను వండి దాంతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉంటారు అలాగే వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారు.

ఈ కార్యక్రమాన్ని మంచు లక్ష్మీ ఎంతో హుషారుగా నడిసిస్తున్నారు. తనదైన మాటలతో షోను ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు లక్ష్మీ. ఇప్పటికే పలువురు సినిమా తారలు ఈ షోకు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ వారం మరో ఇద్దరు సెలబ్రెటీలు హాజరుకానున్నారు. ఈ వారం సింగర్ శ్రీరామ్ చంద్ర,రాశి సింగ్ చెఫ్ మంత్ర షోకు హాజరు కానున్నారు.

ఇందుకు సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు ఆహా టీమ్. సింగర్ శ్రీరామ్ చంద్ర త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి సింగ్ నటిస్తోంది. ఇక ఈ ఇద్దరు చెఫ్ మంత్రలో ఎలా సందడి చేశారు. ఏ వంటకాలు వండి దాంతో తమకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అన్నది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిదే. ఈ నెల 11న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..