AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: సినిమాల్లోకి రావడానికి కాంతార హీరో ఎన్నికష్టాలు పడ్డారో తెలుసా.. వాటర్ క్యాన్లు మోస్తూ…

అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో గత నెల 15న విడుదల చేశారు.ఇక్కడ కాంతార సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

Rishab Shetty: సినిమాల్లోకి రావడానికి కాంతార హీరో ఎన్నికష్టాలు పడ్డారో తెలుసా.. వాటర్ క్యాన్లు మోస్తూ...
Rishab Shetty
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2022 | 4:45 PM

Share

కాంతార ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ కన్నడ సినిమా తెలుగులోనూ సత్తా చాటింది. ఈ సినిమా ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయ్యింది. అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో గత నెల 15న విడుదల చేశారు.ఇక్కడ కాంతార సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దాదాపు 16 కోట్లతో తెరకెక్కించగా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూల్ చేసింది. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.

ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ నటన సినిమా కే హైలైట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగుతోంది. దాంతో ఎవరు ఈ రిషబ్ శెట్టి అని గూగుల్ లో గాలిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ. సినిమాల్లోకి రాకముందు ఏం చేశారో తెలిపారు. ఇంట్లో నాన్నను డబ్బులు అడగలేక  చిన్న చిన్న పనులు చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపారు రిషబ్. సినిమాలకు వెళ్లాలన్న  ఇంట్లో డబ్బులు అడగలేక కూలి పనులకు వెళ్లి డబ్బులు  సంపాదించుకొని ఆ డబ్బులతో సినిమాలు చూశేవాడినని అన్నారు.

2004 నుంచి 2014 వరకు మినరల్ వాటర్ ప్లాంట్ లో వాటర్ క్యాన్లు  అమ్ముతూ డబ్బులు సంపాదించానని అన్నారు. ఆ తర్వాత పలు హోటల్స్ లో పని చేశా.. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ సినిమాల్లో ఛాన్స్ లకోసం ట్రై చేశానని అన్నారు. ఇక ఇండస్ట్రీలో క్లాప్ బాయ్, లైట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశానని తెలిపారు. అన్ని కష్టాలు పడిన తర్వాత 2016వ సంవత్సరంలో తుగ్లక్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించానని అన్నారు రిషబ్. 2017లో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి
Follow Us
ఫోల్డబుల్‌ కాదు.. మరో మోడల్ డెవలప్ చేస్తున్న సామ్‌సంగ్
ఫోల్డబుల్‌ కాదు.. మరో మోడల్ డెవలప్ చేస్తున్న సామ్‌సంగ్
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్