Kriti Sanon: కాబోయే వాడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. కచ్చితంగా ఆ ఒక్క క్వాలిటీ ఉండాల్సిందేనంట..

చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో సీత పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నా ఈ బ్యూటీ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు కాబోయే భర్త గురించి షాకింగ్ కామెంట్స్

Kriti Sanon: కాబోయే వాడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. కచ్చితంగా ఆ ఒక్క క్వాలిటీ ఉండాల్సిందేనంట..
Kriti Sanon

Updated on: May 11, 2024 | 6:35 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి సనన్. కానీ ఆ తర్వాత అంతగా ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో సీత పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నా ఈ బ్యూటీ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు కాబోయే భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే అతడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాలను వివరించింది.

“నాకు కోరికలు చాలా తక్కువ. ఇది కావాలి.. అది కావాలని అడగను. ఎందుకంటే ఇలాంటి కోరికలు ఉంటే మనం చాలా ఒత్తిడికి లోనవుతాము. మనకు కావాల్సింది నిజానికి భిన్నంగా ఉంటుంది. నాకు అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటాను కావచ్చు. కానీ వాస్తవంలో నాకు అతడి నుంచి కేవలం సింప్లిసిటీ, నిజాయితీ మాత్రమే ఉండాలి. అలాగే నన్ను ఎక్కువగా నవ్వించాలి. నన్ను.. నా పనిని గౌరవించే వారితో గంటల తరబడి మాట్లాడగలను. ఇలాంటి విషయాలను అతడు గౌరవించాలి. నా ఆలోచనలతో ఎవరైన సరిగ్గా సరిపోతారని నేను భావించను. కానీ ఎల్లప్పుడు నన్ను సురక్షితంగా చూసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి సనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

కృతి ఇటీవల క్రూ సినిమాలో నటించింది. ఇందులో టబు, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే కాజోల్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ దో పట్టిలో నటిస్తుంది. ఈ సినిమాతో అటు నిర్మాతగానూ మారింది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.