Krithi Shetty: ఆ స్టార్ హీరో తన సెలబ్రెటీ క్రష్ అంటున్న బేబమ్మ.. అందుకే ఇష్టమంటున్న కృతి శెట్టి..

|

Jul 12, 2022 | 11:34 AM

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి .. తన సెలబ్రెటీ క్రష్ ఎవరనే విషయాన్ని బయటపెట్టేసింది. ప్రస్తుతం మీ సెలబ్రెటీ క్రష్ ఎవరు

Krithi Shetty: ఆ స్టార్ హీరో తన సెలబ్రెటీ క్రష్ అంటున్న బేబమ్మ.. అందుకే ఇష్టమంటున్న కృతి శెట్టి..
Krithi Shetty
Follow us on

డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి (Krithi Shetty). ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పటివరకు తెలుగులో చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది బేబమ్మ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తుంది. ప్రస్తుతం బేబమ్మ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ది వారియర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలసిందే. డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.

ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి .. తన సెలబ్రెటీ క్రష్ ఎవరనే విషయాన్ని బయటపెట్టేసింది. ప్రస్తుతం మీ సెలబ్రెటీ క్రష్ ఎవరు అని విలేకరి అడగ్గా.. కృతిశెట్టి స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న హీరోలలో తన క్రష్.. తమిళ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ అని.. తమిళ్ నేర్చుకోవడానికి తమిళ్ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నానని.. అందులో శివకార్తికేయన్ సినిమాలు అధికంగా చూసినట్లు చెప్పుకొచ్చింది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం కృతి శెట్టి కోలీవుడ్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.