Krishnam Raju passes away: ఆ కోరిక నెరవేరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం అయన పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు. ఈ విషయాన్నీ చాలా సందర్భాల్లో ఆయనే తెలిపారు. కృష్ణంరాజు ప్రభాస్ ను హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే

Krishnam Raju passes away: ఆ కోరిక నెరవేరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు..
Krishnam Raju, Prabhas

Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2022 | 1:09 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం అయన పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు(Krishnam Raju). ఈ విషయాన్నీ చాలా సందర్భాల్లో ఆయనే తెలిపారు. కృష్ణంరాజు ప్రభాస్ ను హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాలో ప్రభాస్ నటన అచ్చం ఆయన పెద్దనాన్న కృష్ణంరాజును గుర్తు చేసింది. ఇక ఈశ్వర్ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రభాస్ కు వరుస అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. కృష్ణం రాజు ప్రభాస్ కు మార్గం మాత్రమే చూపించారు.. కానీ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఎదిగి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా ఉన్నారు ప్రభాస్. అయితే చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటి పై కృష్ణం రాజు కూడా స్పందించారు.

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన ఆశపడ్డారు. ఇటీవల ప్రభాస్, కృష్ణం రాజు కలిసి రాధేశ్యామ్ సినిమాలో నటించారు.ఆ మధ్య జరిగిన ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణంరాజు మాట్లాడుతూ.. మ‌న‌వూరి పాండ‌వులు లాంటి చిత్రాన్ని ప్ర‌భాస్ చేస్తే చూడాల‌ని ఉంద‌ని అన్నారు. ప్ర‌భాస్ పెళ్లి విష‌యం గురించి ప్ర‌స్తావ‌న రాగా.. ప్రభాస్ కు పెళ్లై, పిల్ల‌లు పుడితే ఎత్తుకొని ఆడించాల‌ని ఉంది అంటూ కృష్ణం రాజు తెలిపారు. కానీ ఆశ తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. నేడు(ఆదివారం) తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణం రాజు తెల్లవారుజామున 3.25కు తుదిశ్వస విడిచారు. ఆయన మరణం తో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.